రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నాయి. రైతు సంక్షేమమే ధ్వేయంగా కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాయి. అధిక దిగుబడి, లాభాలు గడించే విధంగా ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మెరుగైన రిజల్ట్స్ కనిపిస్తుంది. గతంలో రైతులు తమ పంట ఎక్కడ విక్రయించాలి, ఎవరికి విక్రయించాలి అనే అంశంలో నిబంధనల్లో ఎన్నో పరిమితులుండేవి. దశాబ్దాలుగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు రైతులు తాము ఎప్పుడు విక్రయించాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరికి విక్రయించాలని అనుకుంటే వారికి విక్రయించుకునే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు రైతు తన పంటను దేశంలోని ఏ రాష్ట్రానికైనా తీసుకువెళ్లి విక్రయించవచ్చు.ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడం, రైతు సంక్షేమానికి దోహదపడడం జరుగుతుంది.
గిడ్డంగుల్లో నిల్వ చేసిన ఆహార ధాన్యాలు లేదా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ విధానంలో విక్రయించుకోవచ్చు. ఈ సంస్కరణలతో అగ్రి బిజినెస్ కు ఎన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయో ఊహించుకోవచ్చు. అదేవిధంగా రైతు ఖాతాలకే నేరుగా నగదు బదిలీ నుంచి ఎంఎస్ పి పెంపు, వ్యవసాయదారులకు పింఛను స్కీమ్ వంటి నిర్ణయాలేవైనా రైతును సాధికారం చేయడం లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు రైతులు అతి పెద్ద మార్కెట్ శక్తిగా ఎదిగారు. ఇది కాదనలేని నిజం. బేరసారాలు అందించే శక్తి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కల్పిస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయం ఇప్పుడు
రైతులకు అనుకూలమైన నిబంధనలతో దేశమంతటా విస్తరించింది. ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరిగింది, రైతులకు ప్రయోజనం లభిస్తోంది.
ఇకపోతే ప్రభుత్వ ప్రోత్సహంతో రైతుల ఆలోచనలోను మార్పు కనిపిస్తుంది. ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుంది, పంటను ఏ విధంగా అమ్మాలి అన్న విషయాలపై పూర్తి అవగాహన వచ్చింది. దళారులకు వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యడం, దానికి ప్రభుత్వాలు మద్దతివ్వడం మనం చూస్తున్నాం. మునుముందు వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. సాగు చేసేందుకు పొలం లేని వాళ్ళు మిద్దె పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంస్కృతి ఇలాగె కొనసాగాలని ఆశిద్దాం.
#AgricultureSchemes #Agriculture #eruvaaka #agriculturenews