రైతులు సంప్రదాయ పంటల సాగును పక్కనపెట్టి.. పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్గల పంటలను పండిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు తెల్లబంగారం అన్నదాతకు పంట పండిస్తోంది. ధర ఎక్కువగా పలుకడంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావం పత్తి సాగుపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. తాజాగా పత్తి దిగుబడిపై కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. 2021-22 గానూ సంవత్సరానికి (అక్టోబర్-సెప్టెంబర్) 360.13 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎఐ) అంచనా వేసింది. గత సీజన్లో మొత్తం పత్తి ఉత్పత్తి 353 లక్షల బేళ్లుగా అంచనా వేయగా, ప్రస్తుత సీజన్‌తో పోలిస్తే ఇది 7.13 లక్షల బేళ్లు తక్కువగా ఉందని సీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
#CAI #cottonproduction #agriculturenews #eruvaaka