ప్రపంచం మొత్తం ఆహార భద్రతపై ఆందోళన చెందుతున్న నేపధ్యంలో, ఆధునిక, సాంకేతిక, పరిజ్ఞానం ద్వారా ఆహార పదార్ధాల ఉత్పత్తిని పెంచడంతో పాటు సహజ వనరులైన నీరు, భూమి, పర్యావరణాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకంగా మారింది. దానితోపాటు ప్రకృతి వైపరిత్యాలు, వాతావరణంలో అసహజ మార్పుల నుండి పంటలను కాపాడుకునేందుకు అనేక ప్రక్రియల ద్వారా వ్యవసాయం ముందుకు వెళుతున్నది. అంతేకాకుండా మొక్కకు కావలసిన పోషకాల యాజమాన్యం, కలుపు నివారణ, సకాలంలో సస్యరక్షణ ద్వారా పంటను కాపాడుకునేందుకు కనిపెట్టిన సాంకేతిక ప్రక్రియ మల్చింగ్. మొక్కల చుట్టూ ఉండే వేళ్ళ భాగాన్ని ఏవైనా పదార్ధాలతో కప్పడాన్ని ‘‘మల్చింగ్’’ అంటాము. ఈ పద్ధతికి వరిపొట్టు. రంపపు పొట్టు, చెఱకు పిప్పి, ఎండిన ఆకులు మరియు చిన్న, చిన్న గులకరాళ్ళు మొదలైన వాటిని వాడుతారు. కాని వీటి లభ్యత రాను రాను తగ్గుతున్నందు వలన ప్లాస్టిక్ షీటుతో మల్చి నేలను కప్పివేయడం, ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూ కప్పడాన్ని ‘‘ప్లాస్టిక్ మల్చింగ్ ’’ అంటారు.
ప్లాస్టిక్ మల్చింగ్ యొక్క ప్రయోజనాలు :
- నీటి పొదుపు : మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరికాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 – 70% వరకు నీరు ఆదా అవుతుంది. దీనిని బిందు సేద్య పద్ధతితో కలిపి వాడిన ఎడల అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. అందువల్ల పంటలకు 2 – 3 నీటి తడులు ఆదా అవుతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒకోసారి నీటి కొరత అధికంగానూ, కొన్నిసార్లు తుఫానులు, వరదల వలన అధికంగానూ, ఉన్న పరిస్థితులలో నీటిని సంరక్షించుకొని మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవడం అందరి విధి. ఆ ప్రక్రియకు దోహదం చేసేదే ప్లాస్టిక్ మల్చింగ్.
- కలుపు నివారణ : గత ఖరీఫ్‌లో అధిక వర్షాల వలన విపరీతంగా కలుపు పెరిగిపోయి మిరప, ప్రత్తి మరియు కూరగాయల రైతులు బాగా నష్టపోయారు. పంటకాలంలో రెండు, మూడు సార్లు కలుపు తీయవలసిరావడం, కూలీల ఖర్చు అధికం కావడంతోపాటు, రసాయనాలతో కలుపు నివారణకు ప్రయత్నించడం వలన పంటపై ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. మల్చింగ్ విధానం వలన సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది.
- త్వరగా విత్తనం నాటుకోవచ్చు : ప్లాస్టిక్ మల్చ్‌లు భూమి శీతోష్ణస్థితిలో మార్పులకు గురిచేస్తాయి. ముఖ్యంగా, నలుపు, పారదర్శక మల్చిలు భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచే స్వభావం కలిగి ఉంటాయి. దీనివలన సాగు త్వరగా ప్రారంభమై పంటకూడా త్వరగా వస్తుంది. తెల్లని మల్చ్ భూమి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. మండు వేసవిలో కూడా భూమి ఉష్ణోగ్రత నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
- ఎరువుల వాడకం తగ్గుదల : మల్చింగ్ బిందు సేద్యంతో కలిపి వేయడం వలన సాంప్రదాయ యాజమాన్య పద్ధతులతో పోలిస్తే, ఈ పద్ధతిలో మనం వేసిన ఎరువును మొక్క పూర్తిగా సద్వినియోగం చేసకోగలుగుతుంది. దీనివలన అధిక దిగుబడులు, నాణ్యమైన పంట లభ్యమవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో కంటే తక్కువ ఎరువుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు.
- భూసార సంరక్షణ : ప్రకృతిలో తుఫానులు, వరదల వలన భూమి కోతకు గురికావడం, విలువైన భూసారంతో కూడిన మట్టి కోసుకుపోవడం మనం చూస్తున్నాము. ఈ విధానం అమలు వలన వర్షపు నీరు నేరుగా భూమిపై పడకుండా నివారించడం వల్ల మట్టికోతను నివారిస్తుంది. తద్వారా భూసారాన్ని పరిరక్షిస్తుంది.
- నేల ఉష్ణోగ్రత నియంత్రణ : మొక్క ఎదగడానికి భూమిలోని ఉష్ణోగ్రత పాళ్ళు ప్రభావం చూపిస్తాయి. మొక్క వేళ్ళ చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగ చేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించే అవకాశం మల్చింగ్ వలన ఏర్పడుతుంది.
- భూమిలో చీడపీడల నివారణ : పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచడం ద్వారా భూమిలోకి సూర్యరశ్మి ధారాళంగా ప్రసరిస్తుంది. తద్వారా భూమిలోని క్రిమికీటకాదులు, తెగులు కారక సూక్ష్మజీవులు నశిస్తాయి.
- పంట నాణ్యతను పెంచుతుంది : చెట్టుకు కాసిన కాయకు మట్టితో నేరుగా సంబంధం లేకపోవడం వలన కాయ యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. వివిధ రంగులతో కూడిన మల్చ్‌లు వాడటంతో కాయ సైజు, నాణ్యత పెరిగి, మంచి రంగులో అభివృద్ధిచెందుతుంది. మొక్కకు దాని జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగడం వలన ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు (20 – 60%) పొందవచ్చు.
మల్చింగ్ ఉపయోగపడే విధానం పరిస్థితులు :
- వర్షాధార సాగు ప్రాంతాలలో భూమిలోని తేమను కాపాడుతుంది.
- నీరు లభ్యతతో సాగుచేసే ప్రాంతాలలో అధిక తేమను నియంత్రిస్తుంది.
- గ్రీన్‌హౌస్/పాలిహౌస్‌ల తరహా సాగులో భూమిలో వేడిని తగు మోతాదులో లభించేటట్లు చేస్తుంది.
- భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు, వ్యాధులను నియంత్రిస్తుంది.
- అధిక వర్షాల సమయంలో భూమి కోతను నివారించి దాని సహజ లక్షణాలను కాపాడుతుంది.
మల్చింగ్ షీటు లక్షణాలు :
- ఇవి గాలి చొరబడనీయనివై ఉండాలి.
- నేలపై ఉండే ఉష్ణోగ్రతలను బయటకు పోనీయకుండా ఉండాలి.
- మల్చిషీటు మన్నిక కనీసం ఒక పంటకైనా వచ్చేదై ఉండాలి.
పంట కాలాన్ని బట్టి వివిధ మందం గల మల్చిషీట్లు వాడుతారు. ఏ ఏ రకం పంటకు ఎంత మందం గల మల్చిషీటు వేయాలో ఈ క్రింద పట్టికలో తెలపడమైంది.
అట్లాగే పంట దశను బట్టి మల్చిషీటు వేసే విస్తీర్ణం ఆధారపడి ఉంటుంది. దానిని ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
వివిధ రకాల పంటలకు మల్చివేయవలసిన విస్తీర్ణం :
మల్చిషీటు మందాన్ని, బట్టి ఒక హెక్టారుకు కావలసిన షీటు పరిమాణాన్ని (కిలోల్లో) ఈ క్రింది పట్టిక ద్వారా తెలసుకోవచ్చును. తద్వారా మల్చిషీటు వృధాకాకుండా ఖచ్చితంగా వేయడానికి రైతులకు వీలవుతుంది.
కనుక మల్చిషీటు ఎన్నిక చాలా ముఖ్యం. వేరుశెనగ పంటకు అతి పలుచని మందం గల (7 మైక్రాన్ల) షీటు, తక్కువ కాల పరిమితి కలిగిన పంటలకు (కూరగాయలు, పూలు) తక్కువ మందం (15 – 25 మైక్రాన్లు) కలది, దీర్ఘకాలిక పంటలకు (పండ్లు) ఎక్కువ మందం (50 – 100మైక్రాన్ల) గల షీటునే వాడాలి.
వివిధ పంటలలో మల్చింగ్ పరిమాణం :
- మిరప :
మిరప పంటలో ఒక ఎకరానికి కావలసిన డ్రిప్ లేటరల్స్ పరిమాణం R 4,000 (చ.మీ.)/ లేటరల్స్ మధ్య దూరం (మీ.) R 4000/1.5 R 2666
ఒక ఎకరానికి మల్చింగ్ షీటు ద్వారా కప్పబడవలసిన ప్రాంతం R 1.2 మీ. I 2666 R 3200 చ.మీ.
మిరప పంటకు 25 మైక్రాన్ల మందం గల మల్చి షీటు కావలెను.
25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు యొక్క సగటు మార్కెట్ విలువ రూ. 5/ చ.మీ.
మిరప పంటలో 25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఖర్చు R 3200 I 5 R 16,000/ (ఒక ఎకరానికి)
- టమాటో, వంగ, క్సాప్సికం :
ఒక ఎకరానికి కావలసిన డ్రిప్ లేటరల్స్ పరిమాణం R 4,000 (చ.మీ.)/ లేటరల్స్ మధ్య దూరం (మీ.) R 4000/1.8 R 2222
ఒక ఎకరానికి మల్చింగ్ షీటు ద్వారా కప్పబడవలసిన ప్రాంతం R 1.2 మీ. I 2222 R 2666 చ.మీ.
పై పంటలకు 25 మైక్రాన్ల మందం గల మల్చి షీటు కావలెను.
25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు యొక్క సగటు మార్కెట్ విలువ రూ. 5/` చ.మీ.
పై పంటల్లో 25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఖర్చు R 2666 I 5 R 13,332/` (ఒక ఎకరానికి)
- పుచ్చ మరియు ఖర్బూజ :
ఒక ఎకరానికి కావలసిన డ్రిప్ లేటరల్స్ పరిమాణం R 4,000 (చ.మీ.)/ లేటరల్స్ మధ్య దూరం (మీ.) R 4000/2.9 R 1380
ఒక ఎకరానికి మల్చింగ్ షీటు ద్వారా కప్పబడవలసిన ప్రాంతం R 1.2 మీ. I 1380 R 1656 చ.మీ.
పై పంటలకు 25 మైక్రాన్ల మందం గల మల్చి షీటు కావలెను.
25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు యొక్క సగటు మార్కెట్ విలువ రూ. 5/` చ.మీ.
పై పంటల్లో 25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఖర్చు R 1656 I 5 R 8,280/` (ఒక ఎకరానికి)
- బొప్పాయి :
ఒక ఎకరానికి కావలసిన డ్రిప్ లేటరల్స్ పరిమాణం R 4,000 (చ.మీ.)/ లేటరల్స్ మధ్య దూరం (మీ.) R 4000/1.8 R 2222
ఒక ఎకరానికి మల్చింగ్ షీటు ద్వారా కప్పబడవలసిన ప్రాంతం R 1.2 మీ. I 2222 R 2666 చ.మీ.
బొప్పాయి పంటకు 50 మైక్రాన్ల మందం గల మల్చి షీటు కావలెను.
50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు యొక్క సగటు మార్కెట్ విలువ రూ. 10/` చ.మీ.
బొప్పాయి పంటలో 50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఖర్చు R 2666 I 10 R 26,600/` (ఒక ఎకరానికి)
50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు సుమారు రెండు సంవత్సరముల వరకు తోటలో ఉపయోగపడుతుంది.
- అరటి :
ఒక ఎకరానికి కావలసిన డ్రిప్ లేటరల్స్ పరిమాణం R 4,000 (చ.మీ.)/ లేటరల్స్ మధ్య దూరం (మీ.) R 4000/1.5 R 2666
ఒక ఎకరానికి మల్చింగ్ షీటు ద్వారా కప్పవలసిన ప్రాంతం R 1.2 మీ. I 2666 R 3200 చ.మీ.
అరటిలో 50 మైక్రాన్ల మందం గల మల్చి షీటు కావలెను.
50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు యొక్క సగటు మార్కెట్ విలువ రూ. 10/` చ.మీ.
అరటి పంటలో 50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఖర్చు R 3200 I 10 R 32,000/` (ఒక ఎకరానికి)
గమనిక : ఒక ఎకరంలో మల్చింగ్ షీటు యొక్క పరిమాణం మొక్కలను నాటే పద్ధతిని బట్టి మారుతుంది. ఈ నాటే విధానం మట్టి రకం మీద, వాతావరణ పరిస్థితుల మీద మరియు నీటి వనరుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఒక వరుస పద్ధతిలో డ్రిప్ లేటరల్స్ ఎక్కువ వినియోగం జరుగుతుంది. దీనిని బట్టి మల్చింగ్ షీటు యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. అందుకని సమర్ధవంతమైన తక్కువ డ్రిప్ లేటరల్స్ వినియోగం కొరకు రెండు వరుసల పద్ధతిని అనుసరించడం జరిగినది. ఒక ఎకరానికి కావలసిన మల్చింగ్ షీటు ఖర్చు మార్కెట్‌లో సగటు విలువ ఆధారంగా లెక్కించడమైనది.