తెలంగాణ సేద్యంమన వ్యవసాయంవార్తలు

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0
  • భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే
  • వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఫార్మ్ కన్సల్టెంట్లుగా తయారు కావాలి
  • అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగానిది
  • తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది నవనిర్మాణం
  • కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో సాంప్రదాయ పాలన కొనసాగడం లేదు
  • ముందుచూపుతో, సుధీర్ఘలక్ష్యంతో విభిన్నమైన పాలన కొనసాగుతున్నది
  • తెలంగాణ వచ్చే నాటికి 700 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి
  • సమాజంలో ఉన్న అవకాశాలకు, చదివిన చదువులకు పొంతన లేదు
  • గత ప్రభుత్వాలు అడ్డగోలుగా కళాశాలలకు అనుమతులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ ను దెబ్బతీశాయి ..
  • తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నివారణ చర్యలు చేపట్టింది
  • తెలంగాణలో ప్రతి పూర్వపు ఉమ్మడి జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల ఉండాలన్న లక్ష్యం పెట్టుకున్నాం
  • రాబోయే కాలంలో ప్రపంచానికి అన్నం పెట్టేది భారతదేశం
  • చైనా వ్యవసాయ ఉత్పత్తులు వారికే సరిపోతున్నాయి
  • ప్రపంచంలో అత్యధిక సాగుభూమి ఉన్న దేశాలలో భారత్ ది రెండో స్థానం
  • వరి, గోధుమ మినహా మిగతా పంటలు, కూరగాయలు, పండ్లు దేశంలో అవసరాలకు సరిపడా లేవు
  • దేశంలోని అన్ని ప్రాంతాలకు సరిపడా పంటలను ఉత్పత్తి చేసి పంటల సమతుల్యత చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది
  • దేశంలోని ప్రతి గడపకూ నాణ్యతతో కూడిన ఆహారం, పండ్లు అందేలా చర్యలు తీసుకోవాలి
  • కేంద్రం చొరవ తీసుకుని ఈ నెట్ వర్క్ ఏర్పాటు చేయగలిగితే వ్యవసాయ నిపుణులకు చేతి నిండా పని ఉంటుంది
  • దేశంలోని విశ్వవిద్యాలయాలలో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానిది ఐదో స్థానం
  • తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 43 రకాల నూతన వంగడాలు తీసుకువచ్చింది, 33 మంది విద్యార్థులు పరిశోధనలకు వెళ్లగా, విశ్వవిద్యాలయంలోని 13 రీసెర్చ్ సెంటర్లకు అవార్డులు దక్కాయి
  • నాలుగేళ్ల వ్యవసాయ విద్య అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.25 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది
  • మీ సేవలు వ్యవసాయరంగ అభ్యున్నతికి అందించి రుణం తీర్చుకోవాలి
  • వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులకు రైతులతో తల్లికి, బిడ్డకు ఉన్న సంబంధం ఏర్పడాలి
  • రైతులకు వ్యవసాయం మీద నైపుణ్యం ఏర్పరచుకునేందుకు క్షేత్రస్థాయిలో మీ సేవలు అవసరం ఉంది
  • తెలంగాణ వచ్చాక ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఓ అంచనా ఉన్నది
  • ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే కొత్తగా భూములు సాగులోకి వచ్చేసరికి వ్యవసాయ నిపుణులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరిన ఫలితంగా ఇక్కడ ఏజీ బీఎస్సీ కళాశాల ఏర్పాటు చేశారు
  • రూ.13.5 కోట్లతో బాలుర, బాలికల వసతిగృహాలు నిర్మించడం జరిగింది
  • కళాశాల ఏర్పాటుకు రూ.107 కోట్లు కేటాయిస్తూ అప్పటి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది
  • రాదన్న తెలంగాణను కేవలం ఇద్దరు ఎంపీలతో 543 లోక్ సభ, 245 రాజ్యసభ సభ్యులున్న దేశ పార్లమెంటును ఒప్పించి సాధించడం జరిగింది
  • రాదన్న తెలంగాణను సాధించి
    కాదన్న అభివృద్దిని చేసి చూయిచండం జరుగుతున్నది
  • కళాశాల విద్యార్థులకు తన వ్యవసాయ క్షేత్రానికి మంత్రి గారి ఆహ్వానం
  • సస్యవిప్లవానికి నాంది పలికింది ఎవరు ? నార్మన్ బోర్లాక్ (1967)
  • స్థిర వ్యవసాయం ప్రపంచంలో మొదట ఏ ప్రాంతంలో మొదలయింది ?
  • ఆసియా మదర్ థెరిస్సా ఎక్కడ పుట్టింది ?

యుగోస్లేవియా

  • దేశంలో అత్యధిక రసాయనాలు, ఎరువులు వాడుతున్న రాష్ట్రం ?

తెలంగాణ

  • దేశంలో క్షీరవిప్లవం మొదలుపెట్టిన వ్యక్తి ?

వర్గీస్ కురియన్

కళాశాల విద్యార్థులకు మంత్రి ఐదు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు .. సమాధానాలు చెప్పిన వారికి రూ.1000 చొప్పున బహుమానం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెంలో రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన బాలుర వసతి గృహం (రుద్ర నిలయం) ప్రారంభించి, మొక్కలు నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన ఎంపీ రాములు గారు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, వీసీ ప్రవీణ్ రావు గారు, జడ్పీ చైర్మన్ పద్మావతి గారు, రిజిస్ట్రార్ సుధీర్ గారు, తదితరులు

ఎంపీ రాములు గారి వ్యాఖ్యలు : 

  • వ్యవసాయ నిపుణులుగా రైతులకు సేవలందించాలి
  • ఈ ప్రాంతంలో వ్యవసాయం బలోపేతం అయ్యేందుకు కృషిచేయాలి
  • పీజీ సెంటర్ రాకతో మరిన్ని ప్రయోజనాలు
  • వ్యవసాయమే ప్రపంచానికి ఆధారం
  • వ్యవసాయం లేకుంటే జీవరాశికి మనుగడ లేదు
  • ఆహార ఉత్పత్తిలో కీలకపాత్ర వహించాలి
  • ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి వ్యాఖ్యలు
  • పాలెంలో ఏజీ బీఎస్సీ కళాశాల ఏర్పాటు మంత్రి నిరంజన్ రెడ్డి గారి కృషి ఫలితమే
  • 2015లో కేసీఆర్ గారికి వారి విజ్ఞప్తి మూలంగానే ఏర్పాటు చేశారు
  • ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు
  • పంటల మార్పిడికి వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చొరవ అభినందనీయం
  • కళాశాల విద్యార్థులు రైతులను వాణిజ్య పంటల వైపు మళ్లించాలి
  • మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించి రైతులను లాభసాటి వ్యవసాయం చేసేలా పనిచేయాలి
  • దేశంలో వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • రైతులకు మేలు చేకూర్చ గలిగినప్పుడే చదువుకు సార్దకత
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయ కళాశాలకు మరో 50 నుండి 100 ఎకరాలు సమకూర్చాలని మంత్రి నిరంజన్ రెడ్డి గారికి వినతి
Leave Your Comments

పంట నష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Previous article

ఉత్తమ వాణిజ్య విలువ, బెట్టను, తెగుళ్ళను తట్టుకొనే సహజ పసుపు రకాలకు గుర్తింపుతెస్తున్న రైతు శాస్త్రవేత్తలు

Next article

You may also like