ఏరువాక తరలివచ్చె
పుడమితల్లి పులకరించె
తొలకరితో పలకరించె.
రైతన్నలు పరవశించె “ఏరు ”
వానమబ్బు లురుముచుండె
తొలిజల్లులు కురియుచుండె
పల్లెలన్ని మురియుచుండె
పశువులన్ని ఆడుచుండె “ఏరు ”
పసుపు కుంకాలు జల్లి
బసవన్నల పూజ చేసి
మువ్వల పట్టెడలు పెట్టి
చిరుగంటలు మెడను చుట్టి “ఏరు ”
క్రొత్త దుస్తుల పసుపు పెట్టి
గోరంచుల పంచ గట్టి
ముల్లుకర్రలుచేతబట్టి
జోడెద్దుల అరక కట్టి “ఏరు ”
మేడి కాడి గొరితడ్డలు
నాగళ్ళను చెక్కియిచ్చి
పొలము దున్నురైతులనూ
దీవించెను విశ్వకర్మ “ఏరు ”
పొలము జేరి రైతన్నలు
చెట్టుకొట్టి పెళ్ళలదిమి
సాగు చేయ బాగుచేసి
సాళ్ళు దున్నిరరకలతో “ఏరు ”
ఏరువాక పౌర్ణమితో
విశ్వమంత వెలుగుచుండె
రైతన్నలసందడితో
ఏరువాక సాగుచుండె
“ఏరు ”
రచయిత పెద్దోజునాగేశ్వరరావు
నిజాంపేట్ హైదరాబాద్
ఫోన్ 9849628296
Leave Your Comments