పాలవెల్లువ

ప్రపంచ పాల దినోత్సవం -2021 పై ప్రత్యేక కథనం..

0

ఈరోజు ప్రపంచ మానవాళిని కోవిడ్ -19 పట్టి పీడిస్తున్నది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్తంభించిపోయింది, ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి వున్నది కావున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ పాల దినోత్సవం జరుపుకోవడం సాధ్యపడదు. వర్చువల్ కార్యక్రమాల ద్వారా ప్రపంచ పాల దినోత్సవం జరుపుకోవాలని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలను కోరింది. మానవ పోషణలో పాల యొక్క ప్రాముఖ్యత మరియు కోట్లాది మంది ప్రజల యొక్క జీవనోపాధికి తోడ్పడుతున్న పాడి రంగాన్ని అభివృద్ధి పరిచి, సుస్థిర రంగంగా అభివృద్ధి చెందడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో 2001 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మొదటి ప్రపంచ పాల దినోత్సవంను జూన్ ఒకటో తారీఖున జరపడం అయినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీని ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ పాల దినోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోడంతో పాటు సభలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, పాల యొక్క పోషకాల పైన అవగాహన కార్యక్రమాలు, ర్యాలీ ప్రోగ్రాములు, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి డైరీ రంగంలో తీసుకోవాల్సిన విధానపరమైన విషయాలను మొదలైన వాటి పైన చర్చలు జరిపి పాడి పశువులకు మెరుగైన ఆరోగ్యం మరియు మానవ జాతి అభివృద్ధికి దోహదపడే వివిధ చర్యలను మరియు కార్యక్రమాలను ప్రపంచ దేశాలు చేపట్టాలని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సూచించింది. పాడి రంగానికి చేయూతనివ్వడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు పాలు మరియు పాల ఉత్పత్తులను ప్రజలు నాణ్యమైన పోషకాహారంగా విరివిగా తీసుకొని అందరు ఆరోగ్యాంగా ఉండాలని ప్రతి సంవత్సరం సరికొత్త ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించి డైరీ సెక్టార్ రంగాన్ని అభివృద్ధి పరిచే విదంగా ఏటా వివిధ కార్యక్రమాలను ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. సుస్థిరమైన పర్యావరణం, పోషకాహార భద్రతా మరియు సామజిక ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉన్న సరికొత్త పాడి పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రపంచ దేశాలు వివిధ కార్యక్రమాలను 2021వ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశంగా జరుపుకోవాలని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సూచించింది. కోవిడ్ 19 ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాలు మరియు పాల ఉత్పత్తులు ఏంతో తోడ్పడతాయి. కావున ఈ పాల దినోత్సవాన్ని పాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించడం వంటి అంశాల పైన దృష్టి సారిస్తే బాగుంటుంది అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గ్సనైజేషన్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ప్రపంచంలో అత్యధికంగా పాలు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం వాటా సుమారు 17 శాతం. ఉత్తర ప్రదేశ్ (16.3%), రాజస్థాన్ (12.6%), మధ్యప్రదేశ్ (18.5%), ఆంధ్రప్రదేశ్ (8.0%) గుజరాత్ (7.7), మరియు పంజాబ్ రాష్ట్రాలు పాలు ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలుగా ముందు వరసలో ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో దేశంలో సుమారు 198.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి చేయడం జరిగింది మరియు గత ఆరు సంవత్సరాలలో పాల ఉత్పత్తి రేటు సుమారు 35. 61% ఉందని మనదేశ ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2030 సంవత్సరం నాటికి మన దేశంలో పాలు మరియు పాల ఉత్పత్తుల డిమాండ్ సుమారు 266.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంటుందని నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్డిడిబి ) పాల డిమాండ్ పైన నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. దేశంలో గృహ వినియోగం మరియు ఖర్చులో పాల పైన చేసే ఖర్చు సుమారు మొత్తం ఖర్చులో సుమారు 21 శాతంగా ఉంటుందని ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం దేశంలోని పాల వ్యాపారం విలువ సుమారు 2,56,000 కోట్ల రూపాయలు. 10 శాతం వృద్ధి రేటుతో 2020-21 సంవత్సరం మార్కెట్ విలువ 2,83,000 కోట్ల రూపాయల గా ఉండే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. మొత్తం పాల వినియోగంలో గ్రామీణ ప్రాంతం వాటా సుమారు 57 శాతం. ప్రస్తుతం మన దేశంలో తలసరి పాల లభ్యత ఒక రోజుకు సుమారు 394 మిల్లీలీటర్లు. 2030 సంవత్సరం నాటికి పట్టణ ప్రాంతంల్లో తలసరి వినియోగం (592 మి.లీ) గ్రామీణ ప్రాంతాల కంటే (404 మి.లీ) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎ . పోశాద్రి యం . సునీల్ కుమార్ , జి . శివ చరణ్ ,యం . రఘు వీర్ , ఎ .రమా దేవి ,వై .ప్రవీణ్ కుమార్
కృషి విజ్ఞాన కేంద్రం ,ఆదిలాబాద్.

 

 

Leave Your Comments

పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నయువరైతు..

Previous article

మిద్దెతోట పెంపకంలో ఆదర్శంగా నిలిచిన గృహిణి..

Next article

You may also like