ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగిపోవడంతో ఆహారంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో అది మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మొదలగు విషయాల పట్ల చాలా ఖచ్చితంగా ఉంటున్న చాలా మంది ఆహారం విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇలాంటి ఆలోచనలున్న చాలామంది ఒకానొక ఆహారం వైపు ఎక్కువగా రొట్టెని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దాన్లోని పోషకాలు అమితమైన ఆరోగ్యాన్ని అందిస్తాయని నమ్ముతున్నారు. అందుకే రోజు వారి ఆహారంలో జొన్న రొట్టెలను చేర్చుకుంటున్నారు. దీనివల్ల జీర్ణాశయ పనితీరు మెరుగు పడి ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అంతే కాదు జొన్న రొట్టెల్లో గ్లూటెన్ ఉండదు. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. అందుకే వేసవి కాలంలో జొన్నలని ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు.
జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఇందులో గ్లూటెన్ ఉండదు. ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బి3 ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీవక్రియను పెంచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇన్ని లాభాలున్నా జొన్న రొట్టెలని ఒకరోజు తప్పించి ఒకరోజు ఆహారంలో తీసుకున్నా బాగుంటుంది. ఎక్కువగా రైస్ తినేవాళ్ళు ఒక్కసారి జొన్నలని ప్రయత్నించి చూడండి. అలాగే రోజు వారి జీవితంలో ఒకే రకమైన దాన్యాలని కాకుండా విభిన్నమైన ధాన్యాలని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి.
జొన్నల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments