ఆరోగ్యం / జీవన విధానం

మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

వేసవి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండు.. మామిడి పండు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. మామిడిలో రుచి, కమ్మదనం కంటే అది అందించే లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. మామిడిపండ్లు మన దగ్గర వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగుల్లో లభిస్తున్నాయి. మన వద్ద లభించే మామిడిపండ్లలో లాంగ్రా, బంగినపల్లి, చౌసా, తోతాపురి, సఫేదా, అల్ఫోన్సో రకం చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.
మామిడి పండులో విటమిన్లు, ప్రీబయోటిక్ డైటరీ పీచుపదార్థాలు, పాలీ ఫెనోలిక్ ఫ్లేవనాయిడ్ ఖనిజాలు కలిగి ఉంటాయి. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండ్లను పండుగా లేదా రసాలను తీసి జ్యూస్ గా/ ఫేక్స్ లాగా కూడా సేవించవచ్చును. ఎలా తిన్నా దాని ఆరోగ్య ప్రోత్సాహక లక్షణాల ఫలితాన్ని పొందుతారు. మామిడి పండులో బీటా కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉండి మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ పండులోని విటమిన్ ఏ తో పాటు లభించే కెరోటిన్ దృష్టి నష్టాన్ని నివారించి వయసుకు సంబంధించిన కంటి వ్యాధులైన మాక్యులార్ డిజెనరేషన్, కంటి శుక్లమ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలో లభించే ఏ, సి విటమిన్లు చర్మంపై ఉండే సూక్ష్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలు రాకుండా కూడా నిరోధిస్తాయి.
మామిడి పండ్లను తినడం వల్ల ఎముకలు విరగడాన్ని నివారించుకోవడమే కాకుండా ఎముక బలాన్ని మెరుగుపరిచి, ఎముక సాంద్రతను కూడా మెరుగుపర్చుకోవచ్చు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్ సి, ఫైబర్ శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. ఈ పండులో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్ఛన్నం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లను తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగవు. కానీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి. మామిడి పండు తినడం వల్ల క్యాన్సర్ ను నివారించే సామర్థ్యం వీటికి ఉన్నదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే ల్యుకేమియా, ఇతర రకాల క్యాన్సర్లను ఎదుర్కొనే శక్తి మామిడి పండ్లలో ఉంటుంది. మామిడిపండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన శరీరంలో ఎసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మామిడి పండు తినడం వల్ల దంత సమస్యలు తొలగిపోతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశింపజేసి దంతాలను ధృడంగా చేస్తుంది. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

Leave Your Comments

టీ శాట్ ఛానల్ లో సేంద్రీయ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

Next article

You may also like