వార్తలు

గిరిజనులకు ఉపాధినిచ్చే తునికాకు..

0

తునికాకు మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతుంటాయి. ప్రస్తుతం జిల్లాలోని మహబూబాద్, గూడూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలో 15 రోజులుగా తునికాకు సేకరణ జోరందుకున్నది. ఈ గూడూరు డివిజన్ లో 4 యూనిట్లు, గూడూరు డివిజన్ లో 10 యూనిట్ల ఏర్పాటు చేసి 2.60 కోట్ల స్టాండర్డ్ బ్యాగుల ( ఒక స్టాండర్డ్ బ్యాగు అంటే 50 ఆకుల కట్ట) సేకరణే లక్ష్యంగా అటవీ శాఖ ముందుకు పోతున్నది. ఇప్పటి వరకు రెండు డివిజన్లలో 34 లక్షల స్టాండర్డ్ బ్యాగులను సేకరించింది. ఈ నెల చివరి వరకు లక్ష్యం పూర్తి చేసే దిశగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, పోడు కారణంగా కొందరు తునికాకు కార్మికులు సేకరణపై అయిష్టత చూపుతుండడంతో ఏటేటా తునికాకు సేకరణ తగ్గుముఖం పడుతున్నది. అటవీ శాఖ అధికారులు మాత్రం తునికాకు సేకరణపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. గంగారం, గూడూరు, కొత్తగూడ, గార్ల, మహబూబాబాద్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో తునికాకును సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్కో కట్టకు ప్రభుత్వం రూ. 2 చెల్లిస్తుండగా, ఒక్కొక్కరు రోజూ 400 నుంచి 500 కట్టలు కట్టి అమ్ముకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే గిరిజనుల మోముల్లో ఒక భరోసా కనిపిస్తుంది. ఈ కాలంలోనే చేతికొచ్చే తునికాకు సేకరణతో బతుకుదెరువు లభిస్తుంది. దాదాపు 15 రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిబిడ్డలు అడవిబాట పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం.
గిరిజన గ్రామాల్లో తునికాకు ఎండాకాలం పంటగా ప్రసిద్ధి చెందింది. ఎండాకాలం వచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా తెల్లవారకముందే ఇంటిల్లిపాదీ తునికాకు మూటలతో ఇంటికి చేరుకుంటారు. అందరూ కూర్చుని 50 ఆకులను ఒక కట్టగా కట్టి దగ్గర్లో ఉన్న తునికాకు కల్లం వద్దకు సాయంత్రం వేళ తీసుకెళ్లి విక్రయిస్తారు. ఒక్కొక్కరు రోజుకు 400 నుంచి 500 కట్టల దాకా సేకరిస్తారు. ఈ ఏడాది తునికాకు కట్టకు ప్రభుత్వం ధర రూ. 2 నిర్ణయించింది. తునికాకు కార్మికులకు ప్రభుత్వం బోనస్ కూడా చెల్లిస్తుంది. ఎండాకాలం కావడంతో విద్యార్థులు సైతం తునికాకు సేకరణలో పాలుపంచుకుని వచ్చిన డబ్బును చదువులు, ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటారు. ఖరీఫ్ లో వ్యవసాయ పెట్టుబడుల కోసం వాడుకుంటారు.

Leave Your Comments

బార్లీ నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

టీ శాట్ ఛానల్ లో సేంద్రీయ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like