ఆరోగ్యం / జీవన విధానం

చిన్నపిల్లలకు – ఆరోగ్యకరమైన స్నాక్స్

0
Salty snack including peanuts, potato chips and pretzels served as party food in bowls
ప్రిస్కూల్ వయస్సు అనగా 2 ½ నుండి 5 వరకు అనుకోవచ్చు. ఈ వయస్సులో పిల్లలకు పెరుగుదలతో పాటు ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యమైన విషయము. ప్రిస్కూల్ పిల్లలు ఎక్కువగా బయట దొరికే చిరుతిండ్లు ఎక్కువగా ఇష్టపడుతారు, కాని కొన్ని చిరుతిండ్లు చిన్న పిల్లల ఆరోగ్యంపైన ఎక్కువ ప్రభావితం చేస్తాయి. వీటికి కారణం శుభ్రత మరియు నాణ్యత లేకపోవడమే. కాబట్టి చిన్నపిల్లల ఆహారపు అలవాట్ల కోసం ఇంట్లో తయారు చేసిన కాస్త రుచికరంగా, నాణ్యతలో కూడినదై, పరిశుభ్రంగా చేస్తే సరిపోతుంది. ఈ వయస్సు వాళ్ళు ఎక్కువగా పెద్దలను అనుకరిస్తారు కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిపి పోషకాలతో కూడిన చిరుతిండ్లు అలవాటు చేసుకోవడం మంచిది.
                                    సరైన పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి వున్న వయస్సులో సరైన పోషకాలు పొందలేని పిల్లలు శారీరక రుగ్మతలతో బాధపడతారు. పోషకాహార లోపం వున్న పిల్లలు చాలా సాధారణ సమస్యలు ఊబకాయం, బోలు ఎముకలు వ్యాధి, కండర ద్రవ్యరాశి తగ్గటం, జుట్టు రాలడం, అలసట చిరాకు మరియు టైపు 2 డయాబేటీస్ రావటానికి అవకాశం ఉంటుంది. సమతుల్యం లేని ఆహారం తీసుకుంటే, కొవ్వు పదార్ధాలు,పిండి పదార్ధాలు, చెక్కెర అధికంగా తీసుకోడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, టైపు 2 డయాబేటీస్, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ మరియు భావోద్వేగ సమస్యలతో సహ జీవితాంతం పిల్లలను ప్రభావితం చేస్తాయి, అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. క్యాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. బోలు ఎముకలు, పోరస్ మరియు బలహీనమైన ఎముకలు ఏర్పడుతాయి.
                                    ఆరునెలల వయస్సులో చాలా వరకు అనుబంధ ఆహారంలో మొదలౌతుంది. ఉడికించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వడం మొదలవుతుంది. తల్లిపాలతో తగినంత జింక్, ఇనుము అందకపోవచ్చు కాబట్టి తృణధాన్యాలు మరియు మాంసాహారముతో అధిక ఐరన్ అండ్ జింక్ అందుతాయి.
                                       ప్రిస్కూల్ విషయానికి వస్తే శారీరక పెరుగుదల అధికంగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఎముకలు మరియు దంతాలు పటిష్టంగా ఉండటానికి దోహదపడుతుంది.
                      పోషకాహార లోపం అనేది శారీరక వృద్ధిని ప్రభావితం చేయడమే కాకుండా సరైన మానసిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఈ క్రింద విధంగా చౌకగా లభ్యమైయే తృణధాన్యాలతో ఇంట్లో తయారు చేసుకొనే విధంగా ఇవ్వబడింది.
గోధుమ లడ్డు – కావల్సిన పదార్ధాలు
గోధుమలు – 30 g
పెసరపప్పు – 20 g
వేరుశెనగలు – 20 g
నువ్వులు – 20 g
బెల్లం – 50 g
                               ముందుగా గోధుమలను 6-8 గం. నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన గోధుమలను తేమ లేకుండా నీడలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన గోధుమలను దోరగా వేయించి పిండి చేసుకోవాలి. పెసరపప్పును శుభ్రంగా కడిగి తేమలేకుండా ఆరబెట్టాలి. బాగా ఎండిన పెసరపప్పుని దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి. వేరుశనగపప్పు, నువ్వులు కూడా దోరగా వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని పొడి చేసి, బెల్లంతో కలిపి ముద్దగా/లడ్డు లాగా చుట్టుకోవాలి. గాలిదూరని డబ్బాలో ఒక వారం నిల్వ చేసుకోవచ్చు.
అటుకుల లడ్డు: కావల్సిన పదార్ధాలు
అటుకులు – 100 g
వేయించిన శనగపప్పు – 50 g
వేయించిన శనగలు – 25 g
ఎండుకొబ్బరి పొడి – 25 g
నువ్వులు – 25 g
బెల్లం – 150 g
                             అటుకుల్ని దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు కూడా పొడి చేసుకోవాలి. వేరుశనగపప్పు పొట్టు తీసి పొడి చేసుకోవాలి. మొత్తం అన్నిటిని కలిపి బెల్లంతో ముద్ద/లడ్డులా తయారు చేసుకోవాలి.
వేరుశనగల బిస్కేట్స్ (ముందుగా వెన్న+చక్కర క్రీమ్ లాగా తయారు చేయాలి)
    కావల్సిన పదార్ధాలు- వేరుశనగలు – 50 g
                                 గోధుమ పిండి – 25 g
                                  నువ్వులు – 20 g
                                   వెన్న  – 50 g
                                   కొర్ర పిండి  20 g
                                    బేకింగ్ పౌడర్ – 5 g
                                    చక్కెర – 20 g
                 వేరుశనగ వేయించి కొంచెం గరుగ్గా వుండేటట్లు పొడి చేసుకోవాలి. గోధుమపిండి, కొర్రపిండి మరియు బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి చక్కర పొడి వేసుకొని, చపాతీ పిండిలా తడుపుకోవాలి. చపాతీ లా చేసుకొని కావల్సిన ఆకారంలో కట్ చేసి బేక్ చేసుకోవాలి.
నువ్వుల బిస్కెట్స్: కావల్సిన పదార్ధాలు
నువ్వులు – 50 g
కొర్రపిండి – 25 g
గోధుమపిండి  – 25 g
శనగపిండి – 25 g
ఎండుకొబ్బరి పొడి – 20 g
చక్కర – 20 g
బేకింగ్ పౌడర్ – 5 g
వెన్న – 50 g
                                కొర్రపిండి, గోధుమపిండి, శనగపిండి మరియు బేకింగ్ పౌడర్ అన్నిటిని కలిపి జల్లించాలి. జల్లించిన పిండి ని వెన్నతో చేసిన క్రీమ్ తో ముద్దలా చేసుకొని బిస్కట్ ఆకారంలో చేసి బేక్ చేసుకోవాలి.
వేరుశనగ బర్ఫీ:  కావల్సిన పదార్ధాలు
వేరుశనగ పప్పు – 250 g (వేయించి పొట్టు తియ్యాలి)
జీడిపప్పు- 50 g
కొబ్బరి తురుము – 2 టీ స్పూన్
చక్కర – 250 g
యాలకులు – 3-4
వెన్న( నెయ్య) తగినంత
          వేయించిన వేరుశనగ పప్పు పొడి చేసుకోవాలి. ఒక బాణీ తీసుకొని దానిలో చక్కర, నీరు కలిపి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చిన తరువాత వేరుసనగపొడి, యాలకుల పొడి వేసి దగ్గరాయ్యేంత వరకు సన్న సెగ మీద వుడికించాలి. ఒక వెడల్పాటి పళ్ళనికి నెయ్య రాసి ఆ ఉడికించిన మిశ్రమాన్ని పల్లంలో పోసి అచ్చులు తయారుచేసుకొని వాటి మీద జీడిపప్పు అమార్చుకోవాలి.
 డా.ఎమ్.దీపా, సైంటిస్టు(హచ్.ఎస్.సి), డా. కె.వి.సుబ్రమణ్యం, ప్రినసిపల్ సైంటిస్టు & హెడ్,కెవికె, డా.పి.హరిబాబు,ప్రొఫెసర్, కృషి విజ్ఞాన కేంద్రం, గుంటూరు
Leave Your Comments

లాభసాటిగా పుట్టగొడుగుల పెంపకం..

Previous article

కేంద్ర ప్రభుత్వం డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంపు..

Next article

You may also like