వానాకాలం సాగుపై సమాయాత్తంపై టీ సాట్ లో రైతులతో ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ గారు
రాబోయే తరాలకు శుద్ద ఆహారం అందించాలి
– దేశంలోని అధికశాతం జనాభా వ్యవసాయరంగం మీదనే ఆధారపడి జీవిస్తున్నది
– తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రధాన వనరులన్నీ సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నది
– దానిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని ప్రధానరంగంగా గుర్తించి ప్రతి గుంటకూ సాగు నీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు
– భూసారం పెంచుకునేందుకు రైతాంగం జీలుగ, పిల్లిపెసర, పచ్చిరొట్టలను పొలాలలో వేసుకోవాలి
– రైతులు కంది కొయ్యలు, వరి పొలాలను కాల్చవద్దు
– నాణ్యమైన ఆహారం ఎంత అవసరమో, భూమి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే అవసరం
– రసాయనిక ఎరువుల ఉపయోగం తగ్గించాలి
– వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతుంది .. నిరుద్యోగ యువత ఈ రంగంలో వస్తున్న డ్రోన్ల వినియోగం, ఇతర యాంత్రీకరణ పద్దతులతో ఉపాధి అంది పుచ్చుకోవాలి
– పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారంతోనే అధిక పోషకాలు లభిస్తాయి
– మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతోనే వ్యాధుల బారిన పడుతున్నాం
– సేంద్రీయ వ్యవసాయంతో భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్నది కేసీఆర్ గారి ఆలోచన
– రైతుబంధుకు రూ.14800 కోట్లు, రైతుభీమాకు రూ.1200 కోట్లు, రుణమాఫీకి రూ.5225 కోట్లు, యాంత్రీకరణకు రూ.1500 కోట్లు, విత్తన రాయితీ వంటి పథకాలతో కలిపి మొత్తంగా రూ.22 వేల పైచిలుకు కోట్లు వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా కేటాయించడం జరిగింది
– సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత కరెంటు వంటి వాటిని కలిపితే దాదాపు రూ.60 వేల కోట్లు ఈ రంగానికి కేటాయించడం జరిగింది
– అందుకే ఏడేళ్ల కాలంలో వ్యవసాయరంగంలో దేశంలో అగ్రస్థానానికి చేరుకున్నాం
– మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలి
– కరోనా విపత్తు దృష్ట్యా ప్రభుత్వం రైతుల పంటలను కొంటుంది.. ఎల్లకాలం ప్రభుత్వం పంటలను కొనలేదు
– పత్తి, కంది, నూనెగింజల పంటలను, ఆయిల్ పామ్ ను, కూరగాయల వంటి ఉద్యాన పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేయాలి
– పత్తి సాగులో రైతులు పురుగుమందులు, ఎరువులు నిపుణుల సూచన మేరకే వినియోగించాలి
– వానాకాలం సాగుపై సమాయాత్తంపై టీ సాట్ లో రైతులతో ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్