వార్తలు

ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద..

0

ప్రస్తుతం ధనికులమని చెప్పుకునేందుకు ఇంటి ముందు ఓ ఖరీదైన కారు ఉండటం వారి హోదాకు గుర్తింపు అయితే. ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద ఉండాలనుకోవడం వారి ప్రతిష్టకు కొలమానం. అందుకే పల్లెల్లో ప్రతి రైతు అరుదైన పశువుల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. భారతదేశంలో మేలైన పశు సంపద ఉన్న రాష్ట్రాల్లో హర్యానా తరువాత ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలానికి దక్కిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీటి పోషణలో ఎంత కష్టనష్టాలు ఎదురైన స్థానిక రైతులు వాటి పెంపకంపైనే మొగ్గు చూపుతూ ఉంటారు. ఇందుకు దేశానికే తలమానికంగా గుర్తింపు చూపుతూ పొందిన గుమ్మిలేరు సెమెన్ బ్యాంకు ఈ మండలంలోనే ఉంది. ఇక్కడ రైతులు పశువులపై తమకున్న మక్కువతోనే కమతాలు ఏర్పాటు చేసి పెంచుతూ ఉంటామని ఘంటాపథంగా చెబుతుంటారు. ఇందులో భాగంగా మండల పరిధి చొప్పెల్లకు చెందిన పల్ల సుబ్బారావు అనే రైతుకు చెందిన ఒంగోలు ఆవుకు పదహారు అంగుళాల ఎత్తు, తోక నుండి తల వరకు ఇరవై నాలుగు అంగుళాల పొడవు గల అతి చిన్న సైజు పుంగనూరు ఆవు దూడ ఆదివారం జన్మించింది. దీంతో ఆ రైతు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి హద్దుల్లేకుండా పోయారు. ఇది ఇలా ఉండగా చిన్న సైజు పుంగనూరు ఆవు దూడ జన్మించడం తెలుచుకొన్న సమీప మండలాల రైతులు చూచేందుకు ఎగబడుతున్నారు. దీంతో కరోనా నేపథ్యంలో రైతు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave Your Comments

పచ్చని పొదరింట్లో చుట్టూ పాజిటివిటీ..

Previous article

పశుపోషణలో అధిక లాభాలు ఆర్జిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ..

Next article

You may also like