ఆరోగ్యం / జీవన విధానం

COVID – 19 సందేహాలు, సమాధానాలు, జాగ్రత్తలు..

0

అన్ని వ్యాధులకు కారణం రోగనిరోధక శక్తి తక్కువగా వుండటమే ఒక కారణం. రోగనిరోధక శక్తి పెంచుకోవలంటే మనం తీసుకొనే ఆహారంలో విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు కలిగి వుండాలి.  

మనం రోజువారి తీసుకొనే ఆహారంలో ఎక్కువగా processed foods వుంటాయి. ఇందులో పీచు పదార్ధం మరియు పోషకాలు చాలా తక్కువగా వుంటాయి. కాబట్టి పోషకాలు సంవృద్ధిగా వున్న ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పాలు  గుడ్లు, మాంసం చేపలు కరోనా సమయంలో మరియు అన్ని కాలాలలో ఇవి తీసుకోవటం చాలా అవసరం.  

బీన్స్, చిక్కుడు గింజలు, మాంసాహారం ద్వారా మాంసకృతులు చాలా అందుతాయి. ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు కాప్సికం, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటివి చేర్చండి. గోరు వెచ్చటి నీటితో పాటు పుల్లటి పండ్లు చాలా అవసరం. పుల్లటి పండ్లలో విటమిన్ సి అధికంగా వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బత్తాయి, దానిమ్మ, ఉసిరి, జామలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. తద్వారా కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది. ఇంట్లో పరిశుభ్రతతో పాటు నాణ్యతతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల అంటు వ్యాధుల బారినపడరు. పాలలో రాగి జావలో కాల్షియం అధికంగా వుంటుంది పెరుగును ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా వుంటుంది.  

మైదాతో తయారు చేసిన ఆహార పదార్ధాల కన్నా ముడి గోధుమ పిండిలో పోషకాలు అధికంగా వుంటాయి. మొలకెత్తించిన గింజ ధాన్యాలు మూడింతలు అధికంగా పోషకాలుంటాయి. కూల్డ్రింక్, కరబోనెటెడ్ డ్రింక్స్, మసాల, డీప్ ప్రైస్ కి దూరంగా వుండండీ.  

కూరగాయలతో తయారు చేసిన సూప్స్ ఎక్కువ తీసుకోండి. కొబ్బరి నీరు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. మాంసహారం మాత్రం బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. మిగతవాటితో కలిపి వుంచకూడదు. అన్నిటికంటే ముందు పరిశుభ్రత చాలా అవసరం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం చాలా అవసరం.  

Q 1. పండ్లు కూరగాయలు తినటం వల్ల Covid – 19 వస్తుందా? 

    జ . పండ్లు కూరగాయలు తినటం వల్ల Covid – 19 వస్తుందని ఎలాంటి ఆధారాలు లేవు, కాకపోతే చేతులు sanitise చేసుకొని పండ్లు కూరగాయలు శుభ్రంగా కడిగి తీసుకోవచ్చు. పండ్లు కూరగాయలు పోషకాహారంలో ఒక భాగం, కాబట్టి వీటిని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  

Q 2. పండ్లు కూరగాయలు Covid – 19 సమయంలో ఎలా శుభ్రం చేయాలి.  

    జ.  చేతులు sanitise చేసుకొని, మంచి నీటిలో కడిగి తర్వాత, 10-15 నిమిషాలు ఉప్పునీటిలో వుంచి తిరిగి మంచి నీటితో శుభ్రపరచవచ్చు చేతులు మాత్రం శుభ్రంగా కడుకొవ్వాలి.  

Q 3. Covid – 19 వైరస్ ఆహార ఉపరితలాలు లేదా ఆహార ప్యాకేజింగ్ లో జీవించగలదా? 

     జ.  Covid – 19 వైరస్ జీవించి వుండటానికి, గుణించడానికి ప్రత్యక్ష మానవ లేక జంతు హోస్ట్ అవసరం, కాబట్టి వీటి సంతతి పెంచడానికి ఫుడ్ ప్యాకేజింగ్ నుండి వైరస్ సంక్రమణ కాకుండా, sanitise చేయాలి. చేతులు కూడా శుభ్రంగా కడిగి sanitise చేయాలి.  ప్యాకేజింగ్ ను ముట్టుకునే ముందు ఆ తర్వాత చేతులు శుభ్రం చేయడం చాలా ముఖ్యం.  

Q 4. Covid – 19 వండిన ఆహారం నుండి సంక్రమించే అవకాశం వుందా?  

     జ.  Covid – 19 వండిన ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తుందిని ఆధారాలు లేవు. కాకపోతే మాంసహారం ఖచ్చితంగా ఉండవలసిన ఉష్ణోగ్రతలో చేస్తే ఎలాంటి హాని వుండదు. మనం ఆహారం వండే పద్ధతులు అన్ని ఎక్కువ ఉష్ణోగ్రతలో(70 c – 100 c) చేస్తాం కాబట్టి ఇలాంటి పరిస్థితిలో సూక్ష్మక్రిములు నాశిస్తాయి. కాకపోతే కూరగాయలు, మాంసం నిల్వ చేసేటప్పుడు విడివిడిగా నిల్వ చేయాలి, లేకపోతే సూక్ష్మక్రిములు ఒకదాని నుండి మరొకటికి చేరే అవకాశం వుంటుంది. ముఖ్యంగా వండిన ఆహారం. నిల్వ చేసేటప్పుడు వండిన మాంసం కానీ, కూరగాయలు కలిపి నిల్వ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి.  

Q 5. Covid- 19 సమయంలో బయట కిరాణ షాప్ కి వెళ్ళటం సురక్షితమేన?  

    జ. కేవలం కిరాణ షాప్ కి వెళ్ళడం ద్వారా వస్తుందని ఎందుకంటే సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రంగా కడుక్కొని, మాస్క్ ధరిస్తే కొంత వరకు మనకు రక్షణ వుంటుంది. ఇవి లేకపోతే ఎక్కడికి వెళ్ళిన ప్రమాదమే. కిరాణ షాప్ కు వెళ్ళే ముందు వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.  

Q 6. ఇంటిని పరిశుభ్రం చేసే క్రిమిసంహారక ద్రావణం ఏమిటి? 

    జ. మనం రోజు వారి ఇంటిని శుభ్రం చేసేవి డెటాల్, లైజల్, ఫినాల్ ఇవి సరిపోతాయి. కాకపోతే ఇంట్లో ఎవరికైన covid-19 లక్షణాలు కనిపిస్తే క్రిమిసంహారక 0.005% సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయాలి. ఇథనోల్ తో తయారుచేసిన వాటిని ఉపయోగించవచ్చు (50 ml of 10% సోడియం హైపో క్లోరైడ్, 100 ml నీటితో కలిపితే 5% సోడియం హైపో క్లోరైడ్ అవుతుంది (1:100 dilute) 

Q 7. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏ రకమైన ఆహారంను తీసుకోవాలి?  

    జ.  ఒకే రకమైన ఆహారం ద్వారా అన్ని రకాల పోషకాలు అందవు కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు అందాలంటే కూరగాయలు, పండ్లు ఆహారధాన్యాలు, పాలు, మాంసం, నీరు వంటివి వుండాలి. కాకపోతే రోగనిరోధక శక్తి పెంచడానికి విటమిన్ ఎ ఎక్కువ వున్న ఆహారం, ఆకుకూరలు, గుడ్లు, చేపలు, ఎర్రటి పసుపురంగు పండ్లు తీసుకోవాలి. ఇంకా విటమిన్ సి అధికంగా వుండే పుల్లటి పండ్లు కూడా అంటే ముఖ్యమైనవి.  

కాబట్టి Covid – 19 ను తగ్గించాలంటే బి విటమిన్స్ వున్న తృణధాన్యాలు మరియు పై విధంగా చెప్పినట్టు ఇతర ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు.  

సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి లభిస్తుంది. చేపలు తినడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. సూర్యరశ్మి తగాలని వారికి విటమిన్ డి కాప్సుల్ డాక్టర్ ద్వారా సిఫార్స్ చేయబడుతుంది.  

పోషకాహారం సరిగ్గా తీసుకొని తగినంత మంచినీరు రోజు త్రాగుతుంటే మనం ఆరోగ్యంగా వుంటాము. మనం తీసుకునే ఆహారం ఎక్కువైన తక్కువైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లు, మంచినీరు తగినంత తీసుకుంటే కొన్ని దీరగ్గాకల వ్యాధులకు దూరంగా వుండవచ్చు. మాసాలతో కూడిన ఆహారం ఉప్పు, నూనెలు అధికంగా వాడటం చేత ఊబకాయంతో పాటు గుండెజబ్బులు వస్తాయి. ఆకుకురాలలో పీచు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా వుంటాయి కాబట్టి కాన్సర్ వంటి వ్యాధులు నివారించవచ్చు.             

Leave Your Comments

వివిధ పంటల సమగ్ర సస్యరక్షణకు – రైతులకు అందుబాటులో ఉన్న మొబైల్ యాప్స్

Previous article

క్యారెట్ రైతు విజయగాధ..

Next article

You may also like