ఆరోగ్యం / జీవన విధానం

దాల్చిన చెక్క తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

మన వంటింటి మసాలలో కనిపించేటట్టువంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. అన్ని మసాలా దినుసులలో కల్ల దాల్చిన చెక్కకు ప్రత్యేకమైనవి. ఈ దాల్చిన చెక్కను మనం వంటలలో తగినంత రుచిని సువాసనను పొందటానికి ఉపయోగిస్తుంటాము. అయితే దాల్చిన చెక్క వంటలలో కేవలం రుచిని ఇవ్వడం మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ప్రతిరోజు రాత్రి కొద్ది పరిమాణంలో దాల్చిన చెక్కను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ దాల్చిన చెక్క నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆ నీటిని తాగడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫెనాల్స్, ప్రోయంతోసైనిన్లతో నిండి ఉంటుంది. ఇవి రెండు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తాయి. అదే విధంగా ఈ నీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా వున్నాయి.
దాల్చిన చెక్కలో శోథ నిరోధక లక్షణాలు అధికంగా ఉండటం వల్ల మహిళలలో నెలసరిలో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనంలో వెల్లడయింది. అదే విధంగా దాల్చిన చెక్క నీటిలో మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తద్వారా మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave Your Comments

విశాఖ కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు..బహు బాగు

Previous article

బంతిపూల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న యువరైతు..

Next article

You may also like