ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం ఈ రెండు విషయాల చుట్టూనే ఇప్పుడు మనిషి జీవితం నడుస్తోంది. ఆరోగ్యకరమైనదే తింటున్నామా? ఏది తింటే మంచిది? ఇంతకంటే మంచివి ఇంకేం తినొచ్చు.. ఇట్లాంటి ప్రశ్నలే బుర్ర నిండా తిరుగుతున్నాయి. డాక్టర్లు కూడా మందుల కంటే ఎక్కువగా తిండి విషయంలోనే దృష్టిపెట్టాలని జనాలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల తినే అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. వెనకటి వంటలకు మళ్ళీ డిమాండ్ పెరిగింది. అదే టైంలో రోజూ వంటల్లో వాడే నూనెల్లో ఏది మంచిదనే చర్చా తెర మీదకు వచ్చింది. ఆరోగ్యం కోసం జనాలు ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. ట్రేడింగ్ కోసం ఆన్ లైన్ లో ఉచిత వ్యక్తిగత సలహాదారుని పొందండి. కోవిడ్ టైం నుంచి గ్రోసరీ స్టోర్లలో షెల్ఫ్ ల నిండా హెల్త్ కేర్ ప్రొడక్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇళ్లలో వాడే వంట నూనెల సంగతి ఏంటి.. ఆహారంలో తృణ ధాన్యాల మోతాదు పెరిగినట్లే, ఇప్పుడు గానుగ నూనెలకు క్రేజ్ వచ్చింది. మునుపటి తరాలు వాడిన ఈ నూనెలతో ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం జనాల్లో రోజురోజుకీ పెరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్స్ తో పోలిస్తే గానుగ నూనెల ధర చాలా ఎక్కువ. అయినా కూడా “డోంట్ కేర్” అంటూ కొనుక్కుంటున్నారు. అయితే సైంటిఫిక్ మెథడ్ లో తయారుచేసే రిఫైన్డ్ ఆయిల్స్ తో ఇబ్బందులేంటి.. గుండె జబ్బులు రావని, ఆరోగ్యంగా ఉంటారని, బోలెడు విటమిన్లు దొరుకుతాయని ఇస్తున్న అడ్వార్ట్మెంట్ లో వాస్తవం ఎంత.. రిఫైన్డ్ ఆయిల్ గానుగ నూనెలు.. ఈ రెండింటిలో ఏది బెటర్.. అనే ప్రశ్నకు ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారో చూద్దాం.
రిఫైన్డ్ ఎలా మొదలైందంటే..
గానుగ నూనెల వల్ల ఒకప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు. ఎలాంటి జబ్బులు వచ్చేవి కావు. కానీ తర్వాతి కాలంలో గానుగ నూనె వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందనే ప్రచారం మొదలైంది. గానుగ నూనెల్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందని, ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండెను దెబ్బ తీస్తాయని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. అయితే 1990 లో అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్శిటీ కార్డియాలజీ డిపార్ట్ మెంట్ రీసెర్చర్లు “రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచివని” సర్టిఫై చేశారు. అప్పటి నుంచే గానుగ నూనెలకు బ్యాడ్ టైం మొదలైందని చెప్తుంటారు. ఆ తర్వాతే గుండె జబ్బుల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లు “ఇది గుండెకు మంచిది” మా ప్రొడక్టుల్లో విటమిన్లు ఎక్కువ అనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి రిఫైన్డ్ ఆయిల్స్ తయారయ్యే విధానం చూస్తే అవి మంచివో కాదో అర్థమైపోతుంది.
కెమికల్స్ లో ముంచి, మరిగించి..
రిఫైన్డ్ ఆయిల్స్.. అంటే శుద్ధి చేసిన నూనెలు. ఈ పద్ధతిలో నూనె తయారీ కోసం పూర్తిగా గింజలనే వాడతారనే నమ్మకం లేదు. పెట్రోలియం బైప్రొడక్డ్ అయిన పాలిమర్ ఆయిల్ నుంచి కూడా రిఫైన్డ్ నూనెలు తయారు చేస్తారు. పాలిమర్ ఆయిల్ అగ్గువ, లీటర్ కి 20 రూపాయలకు దొరుకుతుంది. అలాగే రిఫైన్డ్ ఆయిల్ తయారీదారులు నూనె తయారీలో వాడే బేసిక్ మెటీరియల్ ను క్రూడ్ ఆయిల్ అనే పిలుస్తారు. రిఫైన్ చేయడం వల్ల నూనెల్లో నుంచి ఆరోగ్యాన్ని పాడుచేసే పదార్థాలను తీసేస్తారని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారనే విషయాన్ని గుర్తు చేస్తారు. అయితే రిఫైన్డ్ ఆయిల్ తయారీలో ఫిజికల్ తో పాటు కెమికల్ ప్రాసెసింగ్ లు తప్పనిసరి. రిఫైన్ ఆయిల్ తయారీలో నాలుగు ప్రధానమైన స్టేజ్ లు ఉంటాయి. అవి డీ గమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డియోడరైజింగ్. ఈ దశల్లో నూనెలు రకరాల కెమికల్ ట్రీట్ మెంట్ కు గురవుతాయి. హై టెంపరేచర్ వద్ద వేడి చేస్తారు. డీ గమ్మింగ్ లో ముడి చమురుల్లో ఉండే బంకలాంటి పదార్థాన్ని వేరు చేస్తారు. ఈ ప్రాసెస్ లో హెక్సెస్ అనే కెమికల్ ఉపయోగిస్తారు. దీన్ని తర్వాతి స్టేజ్ లలో తీసేసే ప్రయత్నం చేసినా కానీ ట్రెసెస్ మిగిలిపోతాయి. రెండో దశ న్యూట్రలైజేషన్ ప్రక్రియ. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ను తొలగిస్తారు. దీన్ని “కెమికల్ రిఫైనింగ్” అని కూడా అంటారు. ఈ మెథడ్ ని ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ రిఫైనింగ్ కోసం వాడతారు.
ఫాస్పరిక్ యాసిడ్ తో క్రూడాయిల్ ని ట్రీట్ చేశాక కాస్టిక్ సొల్యూషన్ తో న్యూట్రలైజ్ చేస్తారు. అప్పుడు నూనెపై నురుగులాంటి పదార్థం తేలుతుంది. సెంట్రిఫ్యూజ్ విధానం ద్వారా కొన్ని మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆయిల్ ని డియోడరైజేషన్ చేస్తారు. ఇక్కడ 240 నుంచి 260 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో ఆయిల్ ని వేడి చేసి అందులోని ఆడర్ ని తొలగిస్తారు. అలా ఈ నాలుగు స్టేజ్ ల్లో మరికొన్ని ట్రీట్ మెంట్లు చేస్తారు. ఆరేడు రకాల కెమికల్స్ ని ఉపయోగిస్తారు. మొత్తం మీద ఈ ప్రాసెస్ ల ద్వారా తయారైన రిఫైన్డ్ ఆయిల్ బయటకు వచ్చాక దాన్ని ప్లాస్టిక్ కవర్స్, బాటిళ్లలో ప్యాక్ చేస్తారు. ఇలా తయారైన రిఫైన్డ్ ఆయిల్ కు నూనెకు రంగు, రుచి, వాసన కోసం ఎసెన్స్ కలుపుతాయి. ముడి నూనెల నుంచి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఆక్సిడైజ్డ్ ప్రొడక్టులు, మెటల్ అయాన్స్, కలర్ పిగ్మెంట్స్, ఇతర ఇంప్యూరిటీలను తొలగించేందుకు రిఫైనింగ్ పద్ధతి వాడుతున్నామని ఆయిల్ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. రిఫైనింగ్ వల్ల విటమిన్ ఇ పోకుండా ఉంటుందని గింజ నుంచి పూర్తిస్థాయిలో నూనెను పిండొచ్చని అంటాయి. రిఫైనింగ్ ప్రాసెస్ అంతా ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాల ప్రకారమే జరుగుతుందని ప్రచారం చేసుకుంటాయి.
ట్రెడిషనల్ గానుగ నూనెలు:
గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే గానుగ నూనెల తయారీ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆన్ లైన్ లో మిషన్లు తెప్పించుకుని ఇళ్లలోనే నూనె తయారుచేసుకుంటున్నారు కొందరు. సంప్రదాయ పద్ధతుల్లో గానుగ నూనెలు తీసే పద్ధతులు ఉన్నాయి. దున్నపోతులు, ఎడ్లు, లేగదూడలు, గాడిదలను కాడికి కట్టి గానుగలో గింజలు వేసి గుండ్రంగా తిప్పుతారు. అప్పుడు గింజలు పిప్పి పిప్పి అయ్యి ఆ గానుగలో నుంచి నూనె బయటకు వస్తుంది. గానుగ ఆడింటచేప్పుడు ఆర్పీఎం తక్కువగా ఉంటుంది. నిముషానికి రెండు, మూడు చుట్లు తిరిగినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా రిలీజ్ కాదు. ఫలితంగా నూనెలో పోషకాలు పోవు. అయితే ఇప్పుడు కరెంట్ తో నడిచే గానుగ మిషన్లు వచ్చాయి. దీని ఆర్పీఎం కొంచెం ఎక్కువగా ఉంటోంది. గానుగ నూనెలోని దాదాపు అన్ని పోషక విలువలు ఉంటాయి. మిషన్ గానుగల్లో ఇప్పుడు పల్లీ, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ, ఆవాలు, అవిసె, బాదం, కొబ్బరి, ఆముదం గింజల నుంచి రకరకాల నూనెలు తీస్తున్నారు. గింజలు ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మే సెంటర్ల లో ఆర్గానిక్ గింజలతో కళ్ళ ముందే నూనె తీసి ఇస్తున్నారు.
గానుగ ను చెక్కతో తయారు చేస్తారు. మెషిన్ గానుగలోనూ సహజత్వం కోసం చెక్కను వినియోగిస్తారు. అందుకే ఈ పద్ధతిలో తీసిన ఆయిల్ ను చెక్క నూనె అంటారు. గానుగ పద్ధతిలో అతి తక్కువ టెంపరేచర్ లో ఒత్తిడికి గురి చేసి నూనెను ఉత్పత్తి చేయడం వల్ల వీటికి “కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్” అనే పేరొచ్చింది. వర్జిన్, ఎక్సట్రా వర్జిన్ ఆయిల్స్ కూడా సాంప్రదాయ పద్ధతిలో తీసిన నూనెలే. అయితే ఈ పేర్లన్నీ కేవలం కస్టమర్లను ఆకర్షించేందుకే.. రిఫైన్ చేయకుండా సహజ పద్ధతిలో గింజను కోల్డ్ ప్రెస్ చేయడం వల్ల ఉత్పత్తి అయిన ఆయిల్ ని వర్జిన్ ఆయిల్ అని అంటారు. ఇందులో ఎసిడిటీ పర్సంటేజ్ రెండు శాతం కన్నా తక్కువగా ఉంటుంది. దీనికన్నా ఎక్స్ ట్రా వర్జిన్ మంచిది. ఈ ఆయిల్ లో ఎసిడిటీ 0.8 శాతం కన్నా ఎక్కువ ఉండదు. నిజానికి వర్జిన్, ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ అనే పదాలు ఆలివ్ ఆయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ నుంచి పుట్టాయి. ఈ పదాలు ఇతర నూనెలకు సరిపడవు. కానీ ఆలివ్ ఆయిల్ సేల్స్ పెరగడానికి ఈ పేర్లు బాగా పనికొచ్చాయి. అందుకే ఇతర నూనెల ప్యాక్ లపై కూడా ఇలాంటి పేర్లు వాడుతున్నారు. ఇక రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కెమికల్ ట్రీట్ మెంట్ తో తయారవుతాయి. ఇందులో కూడా రకరకాల పద్ధతులున్నాయి. అందుకే రిఫైన్డ్ లో కూడా ఎక్స్ ట్రా రిఫైన్డ్ , డబుల్ రిఫైన్డ్ , ట్రిపుల్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్.. ఈ రెండింటిలో ఏది మంచిది.. అనే అనుమానాలు కూడా ఉన్నాయి. యానిమల్ ఫ్యాట్ లో మోనో అన్ శాచ్యురేటేడ్ ఫ్యాట్ ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్స్ లో పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. శరీరానికి ఈ రెండూ అవసరమే అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. పాత రోజుల్లో ఆవు, బర్రె నెయ్యితో పాటు వెన్నను కూడా వంటల్లో వాడేవాళ్లు. కాబట్టి యానిమల్ ఫ్యాట్ మంచిదని చెప్తుంటారు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ తో గుండె జబ్బులు రావని అంటారు. అయితే తిండి పరిమితంగా ఉన్నప్పుడు ఏ ఫ్యాట్ అయినా మంచిదే అనేది వాళ్ళ మాట.
వంట నూనెల్లో ఏది మంచి నూనె..
Leave Your Comments