ఆరోగ్యం / జీవన విధానం

విటమిన్ “సి” ఉన్న ఆహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. ఈ కరోనా సమయంలో ‘సి” విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా బారిన పడకుండా కాపాడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం, కాస్త ఉప్పు, తేనె వేసుకుని రోజుకు రెండు పూటలా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పగటి వేళ గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన “సి” విటమిన్ అందుతుందని చెబుతున్నారు. విటమిన్ “సి” రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తోంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు కనీసం 500 మి. గ్రా. విటమిన్ “సి” తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు పరిశోధనల్లో తేలింది.
ఎర్రరక్తకణాల తయారీలో ఆక్సిజన్ రవాణాలో ఖనిజ లవణం ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో ఐరన్ స్థాయిలు పడిపోయినప్పుడు విటమిన్ ” సి”అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకా విటమిన్ “సి” గాయాలను మాన్పడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు కరిగించడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అధిక రక్తపోటునూ తగ్గిస్తుంది. రక్తంలోని యూరిక్ ఆమ్ల స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. “సి” విటమిన్ ముఖ్యంగా నిమ్మ, నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, కివీ పండు, జామ, బొప్పాయి, ఉసిరి, బ్రకోలీ, బచ్చలికూర, క్యాబేజీ, పచ్చిమిరప, బంగాళాదుంప, కొత్తిమీరలలో అధికంగా లభిస్తుంది. అదే విధంగా మోతాదుకు మించి విటమిన్ “సి” తీసుకోకూడదు. అమెరికా డై ట్రీ రిఫరెన్స్ ఇన్ టేక్ సూచనల ప్రకారం యుక్తవయస్సులో ఉన్న అబ్బాయిలు రోజుకు 75 మీ.గ్రా., అమ్మాయిలు 65 మి. గ్రా., పురుషులు 90 మి.గ్రా., మహిళలు 75 మి. గ్రా., పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా. విటమిన్ “సి” తీసుకోవాల్సి ఉంటుంది.

Leave Your Comments

కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు..

Previous article

రైతులకు అందుబాటులోకి అధునాతన చెరకు రసం యంత్రాలు..

Next article

You may also like