మన వ్యవసాయం

బ్లాక్ రైస్ గుణాలు.. ప్రాధాన్యత

0
బ్లాక్ రైస్ ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కాలా పట్టి, కళావతి, చత్వాల్, పద్మా బ్లాక్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు.
బ్లాక్ రైస్ యొక్క గుణాలు:
దీనిలో లావు రకం, సన్న రకం ఉన్నాయి. దీనిలో పొటాష్ లెవల్స్ ఎక్కువ. ఇది పెటెంట్ వెరైటీ.
దీని పంట కాలం 140 – 150 రోజులు ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా పోషకాలు, ఫైబర్ కూడా చాలా ఎక్కువ.
దిగుబడి:
10 – 20 బస్తాలు (ఒక బస్తా 75 కేజీలు) మాత్రమే దిగుబడి వస్తుంది.
ఉదాహరణకు గంగిగోవు పాలు గరిటడైనా చాలు అంటే ఔషధ గుణాలు కలిగిన వరి రకాల సాగులో దిగుబడి తక్కువగా ఉంటుంది. అయినా రేటు ఎక్కువగా ఉంటుంది.
ఇక వండుకునే పద్ధతి కాలా పట్టి ని అన్నంగా తీసుకోలేం. దీని అరుగుదలకి చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీనిని పాయసం రూపంలో తీసుకోవచ్చు. ఈ బ్లాక్ రైస్ చరిత్రలో చాలా కథనాలు ఉన్నాయి. ఉదాహరణకు పూర్వం చైనాలో బ్లాక్ రైస్ ని రాజుల కొరకు మాత్రమే పండించే వారంట. ఈ బ్లాక్ రైస్ ఎటువంటి రోగనికైనా మందులాగా పనిచేస్తాయి. వారానికి 2 సార్లు ఏదో ఒక రూపంలో పిల్లలు, పెద్దలు తీసుకోవాలి. ఆయుర్వేద గ్రంథాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. వీటిని గ్రంథాలలో కృష్ణ బియ్యం, కృష్ణ వ్రీహం అని సంభోదించేవారు.  కాలా పట్టి లో ఫోటో సింతటిక్ గుణాన్ని కలిగి ఉంటుంది.
నాటే కాలం:
ఈ పంటను జూన్, జులై మరియు ఆగష్టు నెలల్లో వేసుకోవచ్చు. రెండో పంటగా మాత్రం అసలు వెయ్యకూడదు. ఎందుకంటే  రెండో పంట కాలం 130 – 135 రోజులు మాత్రమే కావున బ్లాక్ రైస్ పంట కాలం 140 – 150 రోజులు ఉంటుంది. కావున కాలం కానీ కాలం లో పంటలను వెయ్యకూడదు.  ఇంకా బ్లాక్ రైస్ కి దుప్పులు, పిలకలు వేసే గుణం తక్కువగా ఉంటుంది. పిలకలు ఎక్కువగా ఉంటే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాని బ్లాక్ రైస్ కి పిలకల శాతం తక్కువ, కంకిలో గింజ శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా నవారా జాతికి చెందిన వరిలో ఒక కంకిలో 60 – 170 వరకు గింజలు ఉంటాయి. సిద్ధ సన్నాలలో 60 గింజలు ఉంటాయి.
వరిలో పిలకల శాతం ఎక్కువగా రావాలంటే .. నాటాక మొదటిసారి కలుపు తీసాక 5,6 రోజులకి లోతు ఉంటుంది. వరి పంటచేలల్లో కోనో వీడర్ ను ఉపయోగించి మనుషులు పంటలో కలుపు తియ్యటం వలన వేర్లు కట్ అవుతాయి. ఇలా వేర్లు కట్ అవ్వడం వలన పిలకలు ఎక్కువగా పెడతాయి. కావున వరి చేలల్లో కోనో వీడర్ ని 4,5 సార్లు తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల పిలకల శాతం పెరుగుతుంది. వరిలో దిగుబడి పెరుగుతుంది.
వరి నీళ్ల ఆధారిత పంట కాదు. వరిలో కలుపు పెరగకుండా ఉండటానికి నీళ్లు పెడతారు అంతేకాని నీటి పంట కాదు.

Leave Your Comments

ఆక్సిజన్ ని అందించే మొక్కలు..

Previous article

ఆ కాకరకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Next article

You may also like