మన చుట్టూ ఇప్పుడు విష వలయం చుట్టుకొని ఉంది. దాని నుంచి తప్పించుకునే దారి లేదు. ఎదుర్కోవడమే మనముందున్న మార్గం. కరోనా మహమ్మారిని జయించడానికి శరీరాన్ని ఓ ఆయుధంగా మార్చుకోవాలి. దాన్ని శక్తి సంపన్నంగా చేసుకోవాలి. అందుకు మార్గం మంచి ఆహారం…ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. కరోనా వైరస్ తో పోరాడాలంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
కరోనా సోకిందని ఆకస్మాత్తుగా ఒకేసారి డైట్ మార్చేసుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
కరోనా, ఇతర కాలానుగుణంగా అంటువ్యాధుల బారినపడకుండా ఉండాలంటే రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం చాలా ముఖ్యం. అన్నం, పప్పు, కూరతో ముగించకుండా 8 రకాల పదార్థాలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు లేదా మాంసాహారం, ఎండు పండ్లు, గింజలు, నూనెలు, బియ్యం, గోధుమలతో పాటు చిరుధాన్యాలు, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి.
వైరస్ శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోడానికి సంపూర్ణమైన శక్తి అవసరం. పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రోటీన్ కోసమని రోజుకి నాలుగేసి గుడ్లు, మాంసం తినేయడం మంచిది కాదు. మాంసాహారులు, వేయించిన పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్, చక్కెర ఇమ్యూనిటీకి ఏ మాత్రం పనికిరావు. ముందునుంచీ కాషాయాలు తాగే అలవాటు ఉంటే ఒకే. లేకపోతే మాత్రం ఒకేసారి అతిగా తీసుకోవడం ఇతర సమస్యలకు కారణం అవుతుంది. జింక్, సిలీనియం వంటివి ఇమ్యూనిటీకి ముఖ్యం కాబట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్స్, పంప్ కిన్ సీడ్స్ వంటివి తినాలి. శరీరాన్ని బాగా హైడ్రేట్ చేసుకోవాలి. తులసి, అల్లం, వాము ఆకుతో టీ లా చేసుకుని తాగడం మంచిది. ఇవి ఇమ్యూనిటీకి మాత్రమే కాకుండా మన ఆహారంలోని చెడుని తొలగించడానికి కూడా ఉపకరిస్తాయి. ఆకుకూరలు, గింజలు వాడాలి. పెసరపప్పు చారు, బీరకాయ కూర వంటివి మంచిది. ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లోనే పోషకాలు అందడం మంచిది.
వైరస్ శరీరంలో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి సంపూరణమైన శక్తి అవసరం. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3, విటమిన్ డి, విటమిన్ సి, ఐరన్, కాపర్, జింక్ ఎక్కువగా వున్న పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పు దినుసులు, పండ్ల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమకూరుతాయి. కాపర్, జింక్,ఐరన్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఎండు పండ్ల ద్వారా అందుతాయి. అయితే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొవ్వు వస్తుంది. అందుకే ఎండు పండ్లు రోజుకు 8 – 10 గ్రాములు తినొచ్చు. పప్పులు, మాంసం, చేపల ద్వారా కావాల్సిన శక్తి సమకూరుతుంది. వైరస్ నుంచి బయటపడిన తర్వాత కూడా కొద్ది రోజులు ఇదే ఆహారాన్ని తీసుకోవాలి.
ప్యాక్ చేసిన ఆహారంతో పాటు నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. పిజ్జాలు, బర్గర్లు, వంటి వాటి జోలికి వెళ్లొద్దు. వీటిలో కొవ్వుతో పాటు ఉప్పు, చక్కెర శాతాలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు తక్కువగా ఉండడమే కాకుండా విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఆశించిన మేర ఉండవు.
మాంసం, గుడ్లు తీసుకుంటే ఎలాంటి హాని లేదు. కానీ అవి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి వండిన వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినరాదు. రోజూ 30 గ్రాముల నూనెకంటే ఎక్కువ తీసుకోవద్దు. అది కూడా రెండు రకాల నూనెలు ఉండేలా చూసుకోవాలి. 5 గ్రాముల ఉప్పు కంటే ఏక్కువ తీసుకోవద్దు. చక్కెర శరీరానికి ఎలాంటి పోషకాలు ఇవ్వదు కాబట్టి కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి.
పొడవును బట్టి బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువ ఉండరాదు. అలాగే 25 శాతం కంటే ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలి.
వ్యాయామం, యోగాతో ఒత్తిడి దూరమవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తగిన మోతాదులో నీరు తాగితే శరీరం పొడిబారకుండా ఉంటుంది.
కోవిడ్ సోకినప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.. అలవాట్లు
Leave Your Comments