చింతపల్లి ఏజెన్సీలో వాతావరణం కాఫీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్లలో కాఫీ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది తోటలు విరగబూశాయి. చింతపల్లి మండలంలో, పాడేరు మండలంలో, మినుములూరు ప్రాంతాల్లోనూ, అనంతగిరి, పెదబయలు మండలాల్లోని పలు పంచాయతీల్లోనూ కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ధర కూడా బాగుంది. దీని వల్ల కాఫీ పంటను పండించడానికి గిరిజన రైతులు మొగ్గు చూపుతున్నారు. ఏడాదిలో ఆరు నెలలు కష్టపడితే చాలు మిగిలిన రోజులు సాఫీగా సాగిపోతాయని వారు చెబుతున్నారు. గత ఏడాది ,మాత్రం కాఫీ రైతులు పంట సరిగ్గా లేక నష్టపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలు కాఫీ పంటకు అనుకూలించాయి. దీంతో పువ్వు విరగబూసింది.
కాఫీలో పలు రకాలు ఉన్నప్పటికీ రబస్తా, అరబిక్ రకాలను మాత్రమే ఏజెన్సీలో సాగు చేస్తున్నారు. అరబిక్ రకంలో పండ్లు మాత్రమే కోస్తారు. రబస్తా రకంలో పండ్లు అవ్వక ముందే కాయలను కోస్తారు. అనంతరం దేనికదే వేరు చేసి పప్పు చేసి అమ్మకాలు చేపడతారు.
ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకం ఆశాజనకం..
Leave Your Comments