సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు..

0

ప్రజలు కరోనా వచ్చాక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్ కు చెందిన రైతు ఐదెకరాల్లో సేంద్రియ సేద్యం చేసేవారు. కూలీల కొరతతో తన భూమిని పట్టణానికి చెందిన మోహన్ కు ఏడాది కిందట కౌలుకిచ్చారు. మోహన్ దానితో పాటు మరో రైతుకు చెందిన మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సేద్యం కొనసాగిస్తున్నారు. ఎకరం పాలీహౌస్ లో అర ఎకరం బీరకాయ, అర ఎకరం పుచ్చకాయ వేశారు. ఎకరం మునగ, ఎకరం పావు లో జామ, 30 గుంటల్లో బొప్పాయి, ఎకరం వరి, రెండెకరాల్లో ఉల్లి, ఇతర కూరగాయలు, నువ్వులు, మినుములు పండిస్తున్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా జీవామృతాన్ని వినియోగిస్తున్నారు.
రెండు కిలోల శనగపిండి, రెండు కిలోల బెల్లం, ఐదు లీటర్ల ఆవు మూత్రం, పది కిలోల ఆవు పేడ, పిడికెడంత పుట్ట మన్ను, 200 లీటర్ల నీళ్లను డ్రమ్ములో వేసి రెండ్రోజులు ఉదయం, సాయంత్రం కలపాలి. నాలుగు రోజుల తర్వాత దాన్ని పంటలకు పిచికారీ చేయాలి. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల ఘన జీవామృతం వేయాలని రైతు తెలిపారు. జీవామృతంలో నాలుగు క్వింటాళ్ల ఆవు పేడను కలిపి ఆర్నెల్ల వరకు వాడొచ్చని చెబుతున్నారు. పురుగు, వైరస్ వస్తే దశవర్ణిక, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రంలలో ఏదో ఒక కషాయం వాడితే ఏ పురుగు రాదని, వారానికొకసారి జీవామృతం, వేపనూనె పిచికారీ చేస్తే పురుగులు,తెగుళ్ల సమస్య ఉండదని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్ల దిగుబడి కొంత తగ్గినా, రుచి బాగుంటుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. సాధారణ పద్ధతిలో సాగుచేసిన వాటితో పోలిస్తే ప్రకృతి సేద్యంతో పండిస్తే మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుందని మోహన్ చెప్పారు.

Leave Your Comments

వేసవిలో కోళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Previous article

వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఎంతో లాభదాయకం..

Next article

You may also like