కదిరి 1812 లేపాక్షి కొత్త రకం వేరుశనగ విత్తనం రైతుల పంట పండించింది. తొలిసారి ప్రయోగాత్మకంగా సాగుచేసిన వారికి కాసుల వర్షం కురిపించింది. ఏటా వేరుశనగ సాగు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న రైతుల ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. అనంతపురం జిల్లా ప్రాంతంలోని కొంత మంది రైతులు కదిరి ప్రాంతం నుంచి కదిరి 1812 లేపాక్షి రకం విత్తన వేరుశనగ కాయలు తెచ్చి సాగు చేశారు. దిగుబడి అంచనాలు మించి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోరైతు ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో సాగు చేశారు. ఎకరాకు 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు.
కదిరి 1812 లేపాక్షి రకం విత్తనాలను ఎకరా విస్తీర్ణంలో 40 కిలోలు చొప్పున విత్తినట్లు రైతులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల సూచనలు మేరకు దుక్కిలో ఎకరాకు జింక్ సల్ఫేట్ పది కిలోలు, వేపపిండి 120 కిలోలు, పొటాష్ 50 కిలోలు, సూపర్ వందకిలోల చొప్పున వేశారు. తవ్వకాలు చేసే సమయంలో జిప్సం 200 కిలోలు వేశారు.
ఉత్తమ ఫలితాలిచ్చిన కొత్త రకం వేరుశనగ
Leave Your Comments