ఆరోగ్యం / జీవన విధానం

సబ్జా , చియా గింజల ఆరోగ్య ప్రయోజనాలు

0

ఎండాకాలం వచ్చేసింది. చల్లని నీటిలో సబ్జ గింజలు వేసుకొని తాగేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. శరీరానికి చలువ కూడా చేస్తుంది. అయితే చియా గింజలు లేదా సబ్జ గింజలు రెండూ ఒకే రకంగా ఉండడం వల్ల వీటి రెండింటి విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆరోగ్యానికి ఈ రెండూ మంచివే. కానీ వీటిలోనూ కొన్ని తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
చియా మెక్సికోలో పుట్టాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శక్తిని పెంచుతాయి. చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడతాయి. బరువు తగ్గేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సబ్జ గింజలను తీపి తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇవి భారత్ లో పుట్టాయి. ఇవి మన శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే ఎండాకాలంలో వీటిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ, జుట్టు రాలడం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై కూడా చేస్తాయి.
సబ్జ గింజలు నలుపు రంగులో ఉండి గుండ్రంగా ఉంటాయి. కానీ చియా గింజలు బూడిద రంగులో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెలుపు, నలుపు రంగుల్లో కూడా ఉంటాయి. అండాకారంలో సబ్జ గింజల కంటే కాస్త పెద్దగా కనిపిస్తాయి. చియా గింజలు నీటిలో వేసిన తర్వాత కొద్ది సేపటి వరకు అలాగే ఉండి నెమ్మదిగా నీటిని పీల్చుకుంటాయి. కానీ సబ్జ గింజలు నీటిలో వేయగానే ఉబ్బడం ప్రారంభిస్తాయి. చియా గింజలను పది రెట్ల బరువు పెరిగి అడుక్కి చేరుకొని జిగటగా తయారవుతాయి. సబ్జ గింజలు మాత్రం చుట్టూ ఒక పారదర్శక పొరను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ రెండింటినీ నీటిలో నానబెట్టి ఓ గంట పాటు ఉంచి తీసుకోవచ్చు. కావాలంటే వీటిని స్మూతీలు, షేక్స్ లో కూడా చేర్చుకోవచ్చు. దీనివల్ల వాటి రుచి కూడా పెరుగుతుంది. సబ్జ గింజలను నిమ్మరసం లాంటి డ్రింక్స్లో వేసుకొని తాగడం వల్ల రుచి పెరగడంతో పాటు చలువ చేస్తుంది. చియా గింజలను నానబెట్టకుండా అస్సలు తినకూడదు. ఇలా తింటే ప్రమాదకరం. పోషకాల్లో ఇవి దేనికదే సాటి. అయితే బరువు తగ్గించడంలో మాత్రం చియా గింజలు ముందుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గొచ్చని చాలా అధ్యయనాలు నిరూపించాయి. భోజనానికి 30 నిమిషాల ముందు వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉండి ఆహారం తక్కువగా తీసుకునే వీలుంటుంది. తద్వారా బరువు వేగంగా తగ్గుతారు.

Leave Your Comments

బిందుసేద్యంతో కూరగాయ పంటల సాగు….లాభాల బాట

Previous article

నవ ధాన్యాల సాగుతో పెరుగుతున్న భూసారం..

Next article

You may also like