వార్తలు

కీరదోస పంట సాగుతో లక్షల్లో లాభాలను పొందుతున్న యూపీ రైతు..

0

అందరికీ అన్నం పెట్టేది రైతు. అటువంటి రైతు పిడికెడు అన్నం కోసం అల్లాడే స్టేజిలో ఉన్న సందర్భాలు ఎన్నో.. ఇక పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి కూడా పగబట్టినట్లు అకాల వర్షాలు కురవడం లేదా అతి వృష్టి, అనావృష్టిలతో రైతుని కన్నీరు పాలు చేస్తుంది. ఇక చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి రైతుకి కష్టాలు, నష్టాలూ రాకుండా మార్కెట్ కు అనుగుణంగా పంటలు పండించే విధంగా తగిన సూచనలు ఇస్తే లాభాలను సులభంగా పొందవచ్చు. తాజాగా వేసవి దాహార్తిని తీర్చే కీరదోస పంట సాగు చేయడం ద్వారా లక్షల్లో లాభాలను సొంతం చేసుకోవచ్చు. అవును కీర దోస పంటను సాగు చేయడం ద్వారా ఓ రైతు ఏకంగా రూ. 8లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు వ్యవసాయాన్ని దండుగ కాదు పండగ చేసుకోలనుకున్నాడు. దీంతో మార్కెట్ పై అధ్యయనం చేశాడు. కీరదోస సాగు చేస్తే ఈజీగా లాభాలను పొందవచ్చు అని తెలుసుకున్నాడు. అయితే మన దేశంలో పండే కీరదోస విత్తనాలు ఉంటాయి కనుక మరింత లోతుగా అధ్యయనం చేశాడు. నెదర్లాండ్స్ నుండి కీరదోస విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశాడు. ఎందుకంటే అక్కడ పండే కీరదోసల్లో మాత్రం విత్తనాలు ఉండవు. పైగా దేశీయ కీరదోసతో పోలిస్తే ఈ కీరదోస రెట్టింపు ధర పలుకుతుంది. కేవలం రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. దుర్గాప్రసాద్ ఈ పంట కోసం ముందుగా రూ. 72 వేలను పెట్టుబడిగా పెట్టాడు. ఇక ఈ పంటపై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలం కీరదోస పంట వేయడానికి అనువైన కాలం. వర్షాకాలంలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. ఈ పంటను సాగు చేయాలనుకుంటే రైతులు ఉద్యాన శాఖ ప్రోత్సహం ఇస్తుంది.

Leave Your Comments

కొన్ని రకాల పండ్లను కలిపి తింటే ప్రమాదకరం..

Previous article

వేసవిలో కొత్తిమీర సాగు ..

Next article

You may also like