ఈ నెల పంటమన వ్యవసాయం

జీడిమామిడిలో యాజమాన్య పద్ధతులు

0
                             జీడిమామిడి తోటలను మన ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, నెల్లూరు మరియు కోస్తా తీర ప్రాంతంలో సుమారుగా మూడు లక్షల హెక్టార్లులో పండిస్తున్నారు. దీని ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరానికి కేవలం 280 కిలోలు మాత్రమే కాని 7 సం॥ల వయస్సు దాటిన జీడిమామిడి తోట నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 960 కిలోల దిగుబడి సాదించవచ్చును. ప్రస్తుతం జీడిపప్పుకు ఎక్కువ గిరాకీ, కస్టమర్స్‌ రావడం ద్వారా మన దేశం ఇతర దేశాల నుండి జీడిమామిడి గింజలను దిగుబడి  చేసుకొని వాటిని జీడిపప్పుగా ప్రాసెసింగ్‌ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. జీడిమామిడి పండ్లలో విటమిన్‌ ‘‘సి’’ ఎక్కువగా ఉండును. జీడిపప్పులో 20 శాతం ప్రోటీన్స్‌, 46 శాతం కొవ్వుపదార్థాలు, విటమిన్‌ ఏ,బి లు సమృద్ధిగా కవు. ఈ జీడి మామిడి తోటలను సాగుచేసే రైతులు ఈ కింది విధంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి.
వాతావరణం : 
                  జీడిమామిడి ఉష్ణమండల పంట. తేమ అధికంగా గల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. చల్లని గాలులను మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. సరాసరి వర్షపాతం 60 మి.మీ అవసరం.
నేలలు :
              నేలలోతు 1.5 మీ. కంటే ఎక్కువగా ఉండాలి. ఇసుక నేలలు, ఎర్ర గరప నేలలు, తేలికపాటి నేలలు, కోస్తా ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలు అనువైనవి. నేల ఉదజని 6.5-7.5 ఉండాలి. భూమిలో నీటి మట్టం 2.5 మీ. అడుగున ఉండి మురుగునీటి పారుదల హెచ్చుగా ఉండాలి.
రకాలు ఎంపిక :
               బి.పి.పి 5,6,8,9 రకాల గింజలు మధ్యస్థంగానూ, లావుగాను ఉండటం వల్ల దిగుమతికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. బి.పి.పి 2,4 మరియు పి.ఆర్‌.ఐ-2 మరియు బి.సి.సి-4. 2 రకాల గింజులు చిన్నవిగా ఉండి గుత్తుగా కాపు కాసి అధిక దిగుబడి నిచ్చును. మొదటగా కాపు వచ్చే 2 లేదా 3 రకాను రైతులు నాటుకోవాలి.
రకాలు – లక్షణాలు : 
బి.పి.పి – 8 : 
               ఇది హైబ్రిడ్‌ రకం. దీని గింజల సైజు పెద్దదిగా ఉండి 6.2-7.0 గ్రా. బరువు ఉండును. చెట్టు సరాసరి దిగుబడి 20 కిలోలు పప్పు 22 శాతం.
బి.పి.పి – 9 : 
                ఇది హైబ్రిడ్‌ రకం. దీని గింజల సైజు పెద్దదిగా ఉండి 7.2 గ్రా. బరువుండును. చెట్టు సరాసరి దిగుబడి 24 కిలోలు పప్పుశాతం 27 శాతం. కాబట్టి నూతనంగా వేసే రైతులు ఖచ్చితంగా బిపిపి-8 మరియు బిపిపి-9 అంటుకట్టిన మొక్కలను నాటుకోవాలి. ఈ గ్రప్ట్సా నాటిన సంవత్సరం నుండి పూతకు వస్తాయి. కానీ ఈ పూతను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఇలా మూడు సంవత్సరాలు వరకు చేయాలి. ఆ తరువాత సంవత్సరం నుండి పంట దిగుబడిని తీసుకోవాలి.
జీడి మామిడి అంట్లు ఎంపిక :
               ఈ అంట్లు 4-6 నెలలు వయస్సు కలిగి 10-15 ఆకు కల్గియున్న అంటు మొక్కలను పొలంలో నాటుకోవాలి.
నాటడం : 
                జీడిమామిడిని నాటుటకు 20 రోజు ముందు 60x60x60 సెం. మీటర్ల గుంతను 8-10 మీటర్ల ఎడంలో తీసి ఎరువు మరియు మట్టి మిశ్రమంతో గుంతను నింపాలి.
వర్షం పడిన తర్వాత జీడిమామిడి అంట్లను, జూలై ఆగస్టు నెలో నాటుకోవాలి. ఎంపిక చేసిన రకపు కొమ్మ అంట్లను, అంటు అతుకు జాయింట్‌ నేకు 5 సెం.మీ పైన ఉండే విధంగా గుంట మధ్యలో నాటాలి.
కత్తిరింపు : 
                కొత్తగా నాటిన అంటు మొక్కలకు తప్పనిసరిగా కొమ్మ  కత్తిరింపులు చేసుకోవాలి. లేత తోటల్లో భూమికి ఆనుకొని ఉన్న మరియు క్రింద కొమ్మలను కత్తిరించి ఏపుగా, గుండ్రంగా పెరిగేటట్లు మొక్కకు ట్రైనింగ్‌ ఇవ్వాలి. ముదురు తోటల్లో ప్రతి రెండు సంవత్సరాలకు, ఒకసారి జులై-ఆగస్టులో ఎండుకొమ్ములు, క్రిందికి/భూమికి ఆనుకొని ఉన్న కొమ్ములు, ఇతర చెట్టు మీదకు పోయిన కొమ్ములు, నీడన ఉన్న కొమ్ములు మొదగు వాటిని కత్తిరించడం వల్ల, శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలకు తగినంత సూర్యరశ్మి, మెతురు, గాలి సోకి చిన్న కొమ్ములు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
అంతరకృషి :
                 తోటను నాటిన తొలి రెండు, మూడు సంవత్సరాల వరకు ముఖ్యంగా వేసవి కాలంలో మొక్కకు తూర్పు, పడమర దశలో తాటాకులను కంచెగా వేయాలి. తోటను పశువుల బారి నుండి కాపాడుకోవాలి. లేత మొక్కల పాదుల్లో ఎండుగడ్డి లేదా ఎండు ఆకులు పరచడం వల్ల వేసవిలో ఆవిరిపోకుండా  కాపాడబడి, కులుపు నివారించబడుతుంది. తొకరిలో వరుస మధ్య భూమిని దున్ని కులుపు లేకుండా చేయాలి.
అంతర పంటు :
తోటను నాటిన తొలి సంవత్సరంలో మొక్కల మధ్య ఉండే స్థలంలో వివిధ కూరగాయలు (టమాట, బెండ, వంగ) పూలమొక్కలు (బంతి, లిల్లీ, చామంతి) మరియు అపరాలు (పెసర, మినుము) సాగు చేయడం ద్వారా రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది.
పూత మరియు కోత :
జీడిమామిడి మొక్కు 4-5 సం॥ పూతకు వస్తాయి. అయినప్పటికీ  లాభసాటి దిగుబడులను 7 సం॥ నుండి  పొందవచ్చు. మన రాష్ట్రంలో జీడి మామిడి పూత జనవరి- ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. కోత ఏప్రిల్‌ నెలలో మొదలై మే- జూన్‌ నెలల్లో ముగుస్తుంది. గింజ తయారగుటకు 45 రోజులు పడుతుంది. సాధారణంగా నేల మీద రాలిన పండ్లను సేకరించి పండ్ల నుండి గింజను వేరుచేస్తారు. అలా వేరుచేసి సేకరించి గింజను 2-3 రోజు ఎండబెట్టి వాటితో 10-12 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
దిగుబడి :
దిగుబడి వేసిన 4వ సం॥ నుండి మొదలు అయినప్పటి నుండి నికడగా ఆదాయం 7వ సం॥ నుండి మొదలవుతుంది. 10 సం॥ తోట నుండి నమోదు చేసిన దిగుబడులు మరియు వాటి పెట్టుబడు ఖర్చు ఇలా ఉన్నాయి.
ఒక హెక్టారుకు ఖర్చు మరియు రాబడి :
కొమ్ములు కత్తిరింపులకు, పాదులు చేయటానికి, ఎరువులు వేయటానికి మరియు
మందులు పిచికారికి అయిన ఖర్చులు = రూ. 71,250/-
                            దిగుబడి =  1,860 కిలోు
                 రేటు 1860×100 = రూ.1,86,000/-
                        నికర లాభం = రూ.1,14,750/-
Leave Your Comments

పెసర.. బహుళ ప్రయోజనకారి

Previous article

సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా భారీగా మొక్కలు పెంపకం..

Next article

You may also like