తెలంగాణవార్తలు

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతవారణ ఆధారిత వ్యవసాయ సలహాలు 03.05.2025 నుండి 07.05.2025

0
గత మూడు రోజుల వాగావరణ:
గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి, పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ  :-
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు మూడు రోజులలో (ఈ రోజు మధ్యాహ్నం 17.05.2025 నుండి 19.05.2025 ఉదయం వరకు) రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసి సూచనలున్నాయి, తరువాత రెండు రోజులలో (19.05.2025 ఉదయం నుండి 21.05.2025 వరకు) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 39 డిగ్రీల సెల్సియన్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
హెచ్చరిక :
మొదటి రోజు :-
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిపే సూచనలున్నాయి.
రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసి సూచలున్నాయి.
రాష్ట్రంలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రెండవ రోజు :-
రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 50-60 ఉ. మీ) తో కూడిన వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కురిసి సూచనలున్నాయి.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూదలున్నాయి.

ముడవ రోజు :-
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచలున్నాయి.
నాల్గవ రోజు :-
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఐదవ రోజు :-
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ 30, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసీ సూచనలున్నాయి.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు :-
వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగుల, తెగుళ్ళకు చెందిన వివిధ దశలు భూమిలోనుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి ఇలా పలువిధాల మేలు కలగడమే గాక భూమి గుల్లభారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.
పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండ నివ్వాలి. దీని వలన నేలలో ఉన్న పురుగులు వాటి గుడ్లు తెగుళ్ళను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ. తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.
రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింది నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్, తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను
తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు మొదలగు పంటలు) ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిన్ తో కప్పి వుంచవలెను.
వర్ష సూచనలున్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారి చేయడం వాయిదా వేసుకోవాలి.
వడగళ్ళ వాన మరియు అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించ వలసిన యాజమాన్య పద్దతులు :-
అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలంనుండి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకొనుటకు  2% యూరియా లేదా 1% పొటాషియం ద్రావణంను పంటపై పిచికారి చేయాలి .
అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయలు పంటల్లో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి .
మామిడి తోటలో పడిపోయిన కాయలను మార్కెట్ కు తరలించాలి . పగిలిపోయిన  కాయలను అలాగే తోటలో వదిలివేసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది  .
మామిడిలో కాయమచ్చ తెగులు  గమనించినట్లయితే 1  గ్రా .కార్బండజిమ్ మందును లీటర్ నీటికి  కలిపి పిచికారి చేయాలి .
వంగ :-
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 10-15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను నుంచి 10000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూటెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్.
మిరప :-
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3గ్రా. థయోమిథాక్సిం లేదా 1గ్రా. డైఫెన్ థయురాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తీగజాతి కూరగాయలు :-
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 2మి.లీ. మలాథియాన్ లేదా 2మి.లీ ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి :-
  • కాయ కోతకు 15 రోజుల ముందుగా నీటితడులు అందించడం నిలిపివేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ. లాంబ్ద్ సైహాలోత్రిన్ 2.5  మి .లీ. వేపనూనె 1500 పి.పి.యం. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్ధతులు
  • తోటలను శుభ్రంగా ఉంచవలెను
  • పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి .
  • 10000 పి.పి.యం వేప నూనెను పిచికారి చేయాలి.
  • పండుగ ఎరలను (2 మి.లీ. మలాధియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200 మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి.
Leave Your Comments

నిల్వ చేసే ధాన్యంలో జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

You may also like