ఆంధ్రప్రదేశ్ఉద్యానశోభతెలంగాణవ్యవసాయ పంటలు

పూల పంటలకు బెడదగా మారుతున్న మొగ్గ ఈగ  (Blossom midge) కాంటారినియా మాకులిపెన్నిస్

0

పుష్ప పంటలలో ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రధానంగా పురుగులలో మొగ్గ ఈగ ముఖ్యమైనది .మొగ్గ ఈగ

(సెసిడోమైడియి) కుటుంబానికి చెందిన ఈగ. ఇవి ప్రధానంగా మల్లె ,నేల సంపంగి , గులాబీ ,లిల్లీ, ఆర్కిడ్ పూలు ఇవి మాత్రమే కాకుండా ఇతర పంటలైన టమాట , వంగ ,కాప్సికం పంటలను ఆశించి నష్ట పరుస్తాయి. ఇవి పూ పంటలపై ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి – మొగ్గ ఈగలు ఎక్కువగా వేసవిలో లేదా వర్షాకాల ప్రారంభంలో (జూన్ – ఆగస్ట్) లో ఎక్కువగా నష్టపరుస్తాయి.

అనుకూల వాతావరణ పరిస్థితులు:-

వేడి ఉష్ణోగ్రత 25 -30°C మరియు అధిక ఆర్థ్రత ఉన్న వాతావరణంలో ఎక్కువగా   అభివృద్ధి చెందుతాయి

నీడ ఎక్కువగా ఉండే తేమగా ఉండే తేలిక పాటి మట్టి నేలలో ఈ పురుగు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది

పువ్వులు పుష్పించే దశలలో మొగ్గ ఈగల ప్రభావం అధికంగా ఉంటాయి

మొగ్గ ఈగ మొక్క జీవన దశలు మరియు లక్షణాలు :-

గుడ్లు:గుడ్లు సూక్ష్మంగా అండాకారంగా  ఉండి పారదర్శకంగా కనిపిస్తాయి

ఇవి సాధారణంగా మొగ్గలపై ఒక్కొక్కటిగా లేదా  సమూహాలుగా పెడతాయి ఇవి తెలుపు లేదా పసుపు వర్ణాలలో ఉంటాయి

గుడ్లు ఆడ మొగ్గ ఈగ సుమారు 30 -120 గుడ్లు పుష్ప భాగాలపై లేదా మొగ్గలలో పెడతాయి .

గుడ్లు సాధారణంగా పుష్ప కొమ్మల మధ్యలో లేదా పూ మొగ్గలపై ఉంటాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు (తేమ ,లేదా తక్కువ ఉష్ణోగ్రత ) కలిగినప్పుడు గుడ్లు 2 – 4 రోజులు లార్వాగా మారుతుంది .

లార్వాలు మొదట రెండు రోజులు తెలుపు వర్ణంలో ఉంటాయి క్రమేపి నాలుగు రోజులలో పసుపు వర్ణంలోకి మారుతాయి .

లార్వా దశ ; గుడ్ల నుండి బయటకి వచ్చిన లార్వాలు అవి పువ్వు మొగ్గలోకి ప్రవేశిస్తాయి.లార్వాలు మొదట రెండు రోజులు తెలుపు వర్ణంలో ఉంటాయి క్రమేపి నాలుగు రోజులలో పసుపు వర్ణంలోకి మారుతాయి . పుష్పాల అభివృద్ధి చెందుతున్న భాగాలైన ఆకర్షక రక్షణ మరియు కేసరాలను తిని అంతర్గతంగా దెబ్బతీస్తాయి ఆ తర్వాత పువ్వులు పసుపు వర్ణంలోకి మారి రాలి క్రిందకి పడిపోతాయి

లార్వాలు సాధారణంగా  పసుపు నుండి గోధుమ రంగులోకి ఉంటాయి .తలభాగం చిన్నగా కనిపిస్తుంది .పుష్పాల లోపల గుంపులుగా చూడవచ్చు .ఇవి మొక్కల పుష్పాల భాగాలను తిని ముడుచుకొని పోయేటట్లు చేస్తాయి ఇవి వృద్ధి చెందకుండా చేస్తాయి “పుష్పమిడ్జి లార్వాలు పుష్పదళాల ఆధారభాగంలో ఉన్న మొగ్గలలోకి ప్రవేశించి, ఆ మొగ్గల ప్రాతస్థానంలో ఉబ్బరం ఏర్పడుతుంది.”

కోశస్థ దశ ;లార్వాలు మొగ్గలలో పూర్తిగా అభివృద్ద్ధి చెందిన తర్వాత అవి బయటకి వచ్చి నేలలో లేదా  పూ మొగ్గలలో కోశస్థ దశను పూర్తి చేసుకుంటాయి

చిమ్మట ;ఇవి సన్నగా నారింజ లేదా తేలిక పాటి బూడిద రంగులో ఉంటాయి

నష్ట లక్షణాలు

  1. మొగ్గలు పూర్తిగా వికసించకముందే ఊడిపోవడం – -పూల మొగ్గలు దశలోనే నశించి నేలపై పడిపోతాయి.
  2. ఆశించిన మొగ్గలు రంగు మారడం – ఎరుపు లేదా నీలం రంగులోకి మారతాయి.
  3. పువ్వులు ముడుచుకుని చిన్నవిగా మారిపోవడం -పరిపక్వతకు రాకుండా వృద్ధి నిలిచిపోతుంది.
  4. పువ్వుల పరిమాణం మరియు నాణ్యత తగ్గిపోవడం -మార్కెట్ విలువ తగ్గుతుంది.
  5. లార్వాలు మొగ్గలలో కనిపించడం – పసుపు నుండి గోధుమ రంగులో ఉండే చిన్న పురుగులు గుంపులుగా మొగ్గలలో కనిపించవచ్చు.
  6. అంతర్గత నష్టం వల్ల పుష్ప భాగాలు శూషించబడి ఉండటం – పుష్పాల లోపలి భాగాలు రసం కోల్పోతాయి.

నేల సంపంగి లో నష్ట లక్షణాలు :-

  1. పుష్ప మొగ్గలు కుళ్లిపోవడం: మిడ్జ్ లార్వా మొగ్గలలోనికి చొచ్చుకొని లోపల నుండి తిని నాశనం చేస్తుంది, దీంతో మొగ్గలు పూర్తిగా వికసించకుండా కుళ్లిపోతాయి.
  2. వికారాకృత ముడులు: పుష్ప మొగ్గలు వంగిపోయి అసాధారణ ఆకారంలోకి మారుతాయి.
  3. తెరవబడని మొగ్గలు: కొన్ని మొగ్గలు వికసించక ముందే ఎండిపోతాయి లేదా మూసివున్నట్లే ఉంటాయి.
  4. బూడిద రంగు మచ్చలు: దెబ్బతిన్న మొగ్గలపై మరియు కళ్లలపై చిన్న చిన్న బూడిద లేదా ముదురు మచ్చలు కనిపించవచ్చు.
  5. పుష్పాల నాణ్యతలో లోపం: పూల పరిమళం, రంగు మరియు వికాసం ప్రభావితమై మార్కెట్ విలువ తగ్గిపోతుంది.
  6. తక్కువ దిగుబడి: మొగ్గలు ఎక్కువగా దెబ్బతిన్న కారణంగా పుష్ప దిగుబడి తక్కువగా ఉంటుంది.

యాజమాన్య పద్ధతులు :

దెబ్బతిన్న పువ్వులను తీసివేసి నాశనం చేయాలి

వేసవి కాలంలో లోతు దుక్కులు చేయడం వలన మట్టిలో ఉన్న గుడ్డు దశను నాశనం చేయవచ్చు

కొమ్మ కత్తిరింపులు చేయడం వలన సూర్యరశ్మి బాగా తగిలేలా చేయాలి

మొగ్గలు ప్రారంభ దశలలో మొక్కల చుట్టూ వైర్ మెష్ నెట్(0.4-0.6 mm) ఉంచడం ద్వారా మొగ్గ ఈగలు  లోపలికి ప్రవేశించకుండా చేయవచ్చు

ముఖ్యంగా పూసే దశలో పంటలలో ఉండే లార్వాలు నేలపై పడిపోతాయి. అలాంటప్పుడు నలుపు రంగు గల మల్చింగ్ షీట్ (25 మైక్రాన్) మందం గల షీట్ ను ఉంచడం వలన వాటి యొక్క కోశస్త దశను అంతరింపచేయవచ్చు

పసుపు రంగు అట్టలను ఎకరానికి 15 చొప్పున పెట్టుకోవాలి .

దీపపు ఎరలనులేదా సొర ఫలకలు గల ఎరలను ఎకరానికి ఒక్కటి చొప్పున పెట్టడం ద్వారా  మొగ్గ ఈగలు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి .

లార్వా పరాన్న జీవి ప్లాటిగాస్టార్ అనే మిత్ర పురుగులను లేదా గుడ్డు పరాన్నజీవి ఒక ఎకరాకు సుమారు 50 ,000 -75 ,000 3 విడతలుగా పుష్ప ప్రారంభ దశలో విడుదల చేయాలి -లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5  చొప్పున పెట్టుకోవాలి.

కొత్తిమీర లేదా బంతి పంట 1 :3 నిష్పత్తిలో నాటుకోవడం వలన పరాన్న జీవి పురుగులను ఆకర్షింపచేసి దాని వలన మొగ్గ ఈగల ఉధృతిని తగ్గించవచ్చు .

మల్లె, నేల సంపంగి పంటలను వరుసల మధ్య నాటుకొని వాటి మధ్య ఖాలీ స్థలం పొడిగా ఉంచడం వలన ప్రభావం తగ్గించవచ్చు.

బవేరియా బసియానా మరియు మెటారీజియమ్ అనీస్లోపియం వంటి 5 గ్రా /లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

25@WG @0.25గ్రా/లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 sc @0.3 మి లీ /లీటరు నీటికి

ఫిప్రోనిల్ 5% SC @ 2మి. లీ/లీటరు నీటికి

రైనాక్సిఫైర్ 20% SC @ 0.5 మి లీ / లీటరు నీటికి

వేపనూనె 1% EC @2-3 మి లీ/లీటరు నీటికి దానితోపాటు డిటర్జెంట్ పౌడర్ కలిపి పిచికారి చేయాలి

స్పినోసాడ్ 45%SC @ 0 3 మి లీ/ లీటరు నీటికి పూల ప్రారంభ దశలలో స్ప్రే చేయాలి .

ఫ్లూబెండియామైడ్ 20% WG @ 0.3 మి లీ/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పైన తెలిపిన క్రిమిసంహారక మందులు పిచికారించేయాలి 10-15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి

పైన తెలిపిన సమగ్ర యాజమాన్య పద్ధతులను అమలు పరచటం వలన మొగ్గ ఈగ వలన కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు

 

Leave Your Comments

మామిడికాయలలో కార్బైడ్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు – మంత్రి తుమ్మల

Previous article

సమస్యాత్మక  పాలచౌడు నేలలు మరియు నల్లచౌడు నేలల సవరణ  యాజమాన్యం

Next article

You may also like