గత మూడు రోజులు కావరణ

గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిపాయి. వగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 43 డిగ్రీల సెల్సియన్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సల్సియస్ జయశంకర్ భూపాలపల్లి మరియు ఈగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ పడగళ్ళ వర్షాలు నమోదయ్యాయి. నమోదయ్యాయి.
రాబోవు ఐదు రోజుల వారావరణ విశ్లేషణ:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 నుండి 43 డిగ్రీల సెల్సియన్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
మొదటి రోజు :
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ తరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి. మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రాష్ట్రంలోని సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి. మీ) తో కూడిన వర్షాలు కురిసే సదనలున్నాయి.
రెండవ రోజు :
రాష్ట్రంలోని కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మార్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరువులు మరియు ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసి సూచనలున్నాయి.
మూడవ రోజు :
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధివ్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30:40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసి సూచనలున్నాయి:
నాల్గవ రోజు :
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట,
జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఊదుకు గాలుల గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఐదవరోజు :
రాష్ట్రంలోని అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, చిరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాడాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలుల (గాలీ వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు

- వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగుల, తెగుళ్ళకు చెందిన వివిధ దశలు భూమిలోనుండి అవి టైటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయదపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి ఇలా పలువిధాల మేలు కలగడమే గాక భూమి గుల్లభారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.
- పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండ నివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు వాటి గుడ్లు తెగుళ్ళను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.
- రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసి సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
- ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు: మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
- తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసి సూచనలున్నందున కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, పొద్దుతిరుగుడు మరియు నువ్వులు మొదలగు పంటలు) ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిన్ తో కప్పి వుంచవలెను.
- వర్ష సూచనలున్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారి చేయడం వాయిదా వేసుకోవాలి.
- వడగళ్ళ వాన మరియు అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించ వలసిన యాజమాన్య పద్ధతులు
- అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలంనుండి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోనుటకు 28 యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణంను పంటపై పిచికారి చేయాలి.
- అధిక వర్షాల వలన శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎడువగా సంభవించినట్లయితే తిరిగ మొక్కలను నాటుకోవాలి.
- మామిడి తోటలో పడిపోయిన కాయలను సికరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్ కు తరలించాలి. పగిలి పోయిన కాయలను అలాగే తోటలో వదటిసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది.
- మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1గ్రా. కార్బండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వంగ :

- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 10-15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి 10000 సి.సి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ప్లూటెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ టెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిప్రోల్.
మిరప :

- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.5 గ్రా. ఎసిఫిట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రా. థయోమిథాక్సిం లేదా గ్రా. డైఫెన్ థయురాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తీగజాతి కూరగాయలు:

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించుటకు అనుకూలం, నివారణకు 2మి.లీ. మలాథియాన్ లేదా 2మి.లీ ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మామిడి:

- కాయ కోతకు 15 రోజుల ముందుగా నీటితడులు అందించడం నిలిపివేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ. లాంబ్రాసైహాలోతైన్ 2.5 Profile 15 1500 ১.১. చేయాలి.
- తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్ధతులు
- తోటలను శుభ్రంగా ఉంచవలెను
- పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి.
- 10000 పి.పి.యం వేప నూనెను పిచికారి చేయాలి.
- పండుఈగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి.
Leave Your Comments