తెలంగాణవార్తలుసేంద్రియ వ్యవసాయం

విత్తన నాణ్యతా ప్రమాణాలు

0

వ్యవసాయంలో ప్రధానమైన అంశము విత్తనం. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆర్యోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులు రోగకారక సిలీంద్ర కలుపు విత్తనాలు లేని ధృవీకరించిన విత్తనాలను, చీడపీడలు సోకని ఆర్యోగ్యవంతమైన పంటల నుండి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
విత్తన నాణ్యతలో ముఖ్యమైన అంశాలు …..
1. భౌతిక స్వచ్ఛత 2. మొలక శాతం 3. విత్తన ఆరోగ్యం 4. జన్యు స్వచ్ఛత
పైన నాలుగు అంశాల్లో జన్యు స్వచ్ఛత అనేది ముఖ్యమైన అంశము. జన్యు స్వచ్ఛత అంటే పంటలోని అన్ని మొక్కలు జన్యురీత్యా ఒకే రీతిగా ఉండాలి . జన్యుస్వచ్ఛత విత్తన నాణ్యత కొరకు 1966 లో రూపొందించిన విత్తన చట్టం ద్వారా విత్తన ధృవీకరణ , మార్కెటింగ్ నియంత్రణ కొరకు జన్యుస్వచ్ఛత పరీక్షకు లోను కావలసి ఉంటుంది . అభివృద్ధి చెందిన వంగడాల యొక్క సమతుల్యతను పెంచడానికి, వాటి స్వచ్ఛతను కాపాడుకోవడానికి జన్యు స్వచ్ఛత చాలా అవసరం. అభివృద్ధి చెందిన వంగడాలు ఎక్కువసార్లు ఉత్పత్తి చేస్తే ఆ వంగడాల యొక్క జన్యు స్వచ్ఛతను ముఖ్యంగా యాంత్రిక కల్తీలు అసంకల్పిత సంపర్కము, జన్యుపరమైన మార్పులు జన్యు స్వచ్ఛత క్షిణతకు దోహదం చేస్తాయి.
జన్యు స్వచ్ఛతలను ముంఖ్యంగా కలుపుమొక్కలు తీసివేయడం, కనీస దూరం పాటిచటం, మంచి విత్తనం వాడుక, దృవీకరించినబడిన విత్తనం, క్రమము తప్పకుండా విత్తిన పొలం తనిఖీ చేయాలి.
జన్యు స్వచ్ఛత ముఖ్యంగా ఓ.డి.వి పరీక్ష మరియు జి.ఓ.టి పరీక్ష ద్వారా నిర్దారిస్తారు
భౌతిక స్వచ్ఛత :
ఇతర రకములైన పంట విత్తనం గుర్తించే పరీక్ష. ఇందులో విత్తనం బాహ్యంగా పరీక్షించి దాని యొక్క లక్షణమును బట్టి జన్యు స్వచ్ఛతను నిర్ధారిస్తారు. సమర్పిత నమూనను టేబుల్ పై సమంగ పరిచి లక్షణములు పరీక్షిస్తారు. విత్తనంలో ప్రత్యేక లక్షణాలును తేడా ఉన్న విత్తనాలను వేరే పరిచి పెట్రిప్లేట్ లో పెడతారు. వాటి సంఖ్యను లెక్కించి నమోదు చేస్తారు.
మొలక శాతం :
విత్తన మొలక శాతం చాలా ముఖ్యమైన అంశము. విత్తుకోబడ్డ పంట మంచి విత్తనం అయితేనే మంచి పంట చేతికి వస్తుంది. రైతులు పంట పొలంలో విత్తేముందు తమకు అందుబాటులో ఉన్న మట్టి పాత్రలో గాని, న్యూస్ పేపర్ మీద గాని ,లేదా పేపర్ టవల్లో 100 గింజలు లెక్కించుకొని విత్తుకోవాలి. పంట రకాన్ని బట్టి మొలక శాతం మారుతుంది. వరి పంట అయితే 80 శాతం, వేరుశనగ పొద్దు తిరుగుడు 70 శాతం, ఆముదము, మినుము,పెసలు మరియు కంది 75 శాతం, బెండ మరియు పత్తికి 65శాతం, మొలకలు ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. రైతులు పొలంలోనే మంచి విత్తన్నాని ఎంపిక చేసుకొని లేదా నీరు వర్షం నుండి కానీ ప్రభుత్వ విత్తనాభివృద్ది సంస్థ నుండి కానీ మంచి విత్తనాన్ని ఎన్నుకొని విత్తేముందు విత్తన శుద్ధి విధిగా చేసుకోవాలి. పేపర్ టవల్ పద్ధతి ద్వారా విత్తనం మొలక శాతాన్ని నిర్ధారిస్తారు. రైతులు తమస్థాయిలో విత్తేముందు 100 గింజలు చిన్న మట్టి పాత్రలో వేసి విత్తన మొలక శాతం 7 రోజులు తర్వాత నిర్ధారించుకోవాలి .
విత్తన ఆరోగ్యం :
విత్తనాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి విత్తన పరీక్ష చేయించాలి. విత్తనాలను భూతద్దంలో పరీక్షించినప్పుడు ఆరోగ్యకరమైన విత్తనాలతో పాటు కొన్ని రంగు మారిన విత్తనాలు మూసుకొని పోయి విత్తనాలు ఉంటాయి. వాటికి మైక్రోస్కోప్ కింద పెట్టి పరీక్షించినప్పుడు రంగుతో పాటు మచ్చలు కనిపిస్తాయి. బ్లాటార్ పేసక్ పద్ధతి అగార్ ప్లేట్ పద్దతి మరియు ఉప్పునీటి ద్రావణంలో నానబెట్టి పరీక్ష చేయడం ద్వారా విత్తన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. అవేకాకుండా ఎలైసా పద్ధతి, మాల్ క్యూర్ పద్దతి ద్వారా విత్తనాలు ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా సోయాచిక్కుడులో AISB-15, కందులలో డబ్ల్యూ.ఆర్. జి .ఇ – 97, మినుము ఎం.బి. జీ -1070 , రకాలు వరిలో రాజేంద్రనగర్ వరి- 28361, వరంగల్ వరి-1119, జొన్నలో తాండూర్ జొన్న -55 ,సజ్జలు పాలెం సజ్జ – 1625,రాగిలో పాలెం రాగి -38, మొక్కజొన్నలో తెలంగాణ మిల్కీ -3 , రూపొందించడం జరిగింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మే మాసం 24న విత్తన మేళ జరుగుతుంది. కాబట్టి రైతులు నాణ్యమైన విత్తనాన్ని యూనివర్సిటీ ఆడిటోరియంలో కొనుక్కుని అధిక దిగుబడి సాధించగలుగుతారు.

బి. రాజేశ్వరి, యమ్.మాధవి, శ్రీధర్ చోహన్.వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.

 

Leave Your Comments

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

Previous article

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు తేది: 03.05.2025 నుండి 07.05.2025వరకు

Next article

You may also like