వార్తలు

అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో మామిడి పండ్ల సాగు లక్షల్లో ఆదాయం

0

పండ్ల సాగు వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటారు చాలా మంది. అది నిజమే అని నిరూపిస్తున్నాడు మహారాష్ట్ర మిరాజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలాంకీ గ్రామానికి చెందిన రైతు పరమానంద. అతను జస్ట్ 2 ఎకరాల భూమిలో ప్రత్యేక మామిడి తోట వేసి.. లక్షాధికారి అయ్యాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. అతను పండించే మామిడి ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు, రాయ్ పూర్ కి రవాణా అవుతోంది. మామిడి దిగుబడి నానాటికీ పెరుగుతుంది.
62 ఏళ్ల పరమానంద 2 ఎకరాల పొలంలో 15 టన్నుల మామిడిని ఉత్పత్తి చేశాడు. శాఫ్రాన్ మ్యాంగో జాతి మొక్కలను ఎకరాకు 900 నాటాడు. ఇందుకోసం అతను అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానం అవలంభించాడు. ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్ల సాగు కోసం ఈ విధానాన్నే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల సంప్రదాయ పద్ధతుల్లో కంటే 200 శాతం ఎక్కువ పంట దిగుబడి సాధించేందుకు వీలవుతుంది. UHDP విధానంలో వచ్చే అన్నీ ఒకేలా, ఒకే రంగులో ఉంటాయి. అలాగే వాటి రుచి, తాజాదనం కూడా చక్కగా ఉంటుంది. 2013 లో 3 టన్నుల మామిడి మాత్రమే వచ్చేది. అప్పట్లో అదే మొదటి దిగుబడి. 2020 నాటికి దిగుబడి పెరిగే ఎకరానికి 7.5 టన్నులు వచ్చింది. మామిడిని సరిగ్గా పెంచితే ఎకరానికి 10 టన్నులు కూడా రాబట్టవచ్చని పరమానంద అప్పుడు అనుకున్నాడు. పరమానంద గురించి వార్తల్లో రావడంతో మహారాష్ట్రలో అతను ఫేమస్ అయ్యాడు. చాలా మంది రైతులు అతని దగ్గరకు వచ్చి పంట సాగు విధానం తెలుసుకొంటున్నారు. కరోనా సమయంలో కూడా గతేడాది చాలా మంది వచ్చి అనుమానాలు తీర్చుకున్నారు. పరమానంద మామిడి చెట్లను 7 అడుగులకు మించి పెరగకుండా చేశాడు. దాని వల్ల 4 ఏళ్లలో పంట చేతికి వచ్చింది. సంప్రదాయ పద్ధతుల్లో 7 ఏళ్లకు పైగానే పడుతుంది. పరమానంద ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నాడు. ఎరువులు, కూలీలకు వేతనాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ లక్ష పోగా అతనికి ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం మిగులుతోంది. UHDP విధానాన్ని ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా లో కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఇండియాలో కొంత మంది రైతులు కూడా ఇదే విధానం చేపడుతున్నారు. ఈ విధానంలో నీటి వాడకం 50 శాతం తగ్గుతుంది. శాఫ్రాన్ మామిడితోపాటు అల్ఫాన్సో, రుమానియా మామిడి కూడా పండిస్తున్నాడు. ఈ జాతి పండ్లు ఉత్తరాంధ్రలో పండుతాయి. UHDP విధానంలో దిగుబడి 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరమానంద తెలిపాడు.

Leave Your Comments

చెరకు సాగులో ఒంటి కన్ను ముచ్చె విత్తన మొక్క నాటడం వలన ఎన్నో ప్రయోజనాలు

Previous article

లంబసింగి రైతులు స్ట్రాబెర్రీ జామ్ తయారీ లక్షల్లో ఆదాయం

Next article

You may also like