
నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, కడప. చిత్తూర్, అనంతపూర్ మరియు తెలంగాణ లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధిక0గా సాగవుతూన్నది. వేరుశెనగ పంటను పండించే రైతులు ముఖ్యంగా వేరుశెనగ త్రవ్వడం మరియు నూర్పిడి చేయడంలో చాల సమస్యలన ఎదుర్కుంటున్నారు మరియు వేరుశెనగ పంట ఒకేసారి కోతకు రావడం వల్ల కూలీల సమస్య తీవ్రంగా ఉంటుంది . పక్వానికి వచ్చినా కాయను త్వరగా కోయకపోవడం వల్ల కాయ భూమిలోనే కుళ్లిపోతుంది మరియు కూలీలు వంగి పని చేయడం వల్ల అధిక శారీరక శ్రమ కు గురవుతున్నారు మరియు కాయ భూమిలోనే సగం విరిగిపోతుంది. సాధారణంగా రైతులు పంట కోతను మనుషులతో లేదా గుంటకను ఉపయోగిస్తారు దీని వల్ల కూలీల ఖర్చు 5-8 వేల దాక అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు యంత్రలా వైపు మొగ్గు చూపుతున్నారు. కట్టే నుండి కాయలను వేరు చేసే త్రెషెర్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వేరుశెనగ త్రవ్వే యంత్రం (డిగ్గర్) అందుబాటులో కి వచ్చింది. ఈ యంత్రమును ఉపయోగించి కూలీలా ఖర్చు , సమయం మరియు శారీరక శ్రమ ఆదా చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.
యంత్రం పని చేయు విధానం : ఈ యంత్రాన్ని 40 అశ్వ సామర్ధ్యం పైన కల్గిన ట్రాక్టర్ త్రీ పాయింట్ హిచ్ పీ కి అనుసంధానం చేయాలి. ఈ యంత్రం ట్రాక్టర్ పి.టి. ఓ. సహయాంతో పని చేస్తుంది ఈ యంత్రం లో ముఖ్యం గా 4 భాగాలు ఉంటాయి అవి 1. బ్లేడ్ 2. చైన్ టైపు కన్వేయర్, 3. గేర్ బాక్స్ 4. v- ఆకారం లో వేరుశెనగలను సేకరించే భాగం. ఈ యంత్రం వెడల్పు 1.2 మీటర్లు ఉంటుంది . ఒకేసారి 4 వరుసలలో కవర్ చేస్తుంది . ముందు గా బ్లేడ్ 40 డిగ్రీ ల కోణంలో భూమిలోకి చొచ్చుకొని వేరుశెనగలను వేళ్ళతో పాటు కాయలను త్రవ్వుతుంది . ఈ విధంగా త్రవ్విన కాయలను చైన్ కన్వేయర్ మీద కంపనం కి గురి అయి మట్టి మరియు కాయలు వేరు అవుతుంది, మట్టి కిందికి పడి పోతుంది. వేళ్ళతో ఉన్నటువంటి కాయలు వెనుక వైపు వెళ్లి ఒక V-shape ఆకారంలో ఉన్నటువంటి భాగం మీద పడి దీని ద్వారా వెనుకవైపు ఒక క్రమ పద్దతిలో వరుసలలో పడుతుంది . దీని ద్వారా పంట త్వరగా ఆరిపోతుంది. ఈ యంత్రం ద్వారా గంటకు 1 ఎకరా పొలంలో కాయలను త్రవ్వుకోవచ్చు అదే కూలీలు అయితే 1 ఎకరా పొలంలో 10-15 మంది అవసరం. మరియు 1 గంటకు 1.5 నుండి 2 లీటర్ల డీజిల్ వినియోగించుకుంటుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 8-10 ఎకరాలో వేరుశెనగ కాయలను త్రవ్వుకోవచ్చు. ఈ యంత్రం ఖరీదు ప్రస్తుత౦ మార్కెట్లో 1.5-2 లక్షల వరకు ఉంది . కొన్ని ఏరియా ల లో ఈ యంత్రం అద్దెకు కూడా లభిస్తుంది. ప్రస్తుతం, ఈ యంత్రం కృషి విజ్ఞాన కేంద్రంలో (మహబూబ్ నగర్) ఎకరానికి 1500 రూపాయలకు అద్దెకు అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలంటే, వారు (ఎ. మస్తానయ్య, శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీరింగ్) సంప్రదించగలరు. ఈ యంత్రాలు రైతులకు అందుబాటులలో ఉండడానికి ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గాలలో మరియు కృషి విజ్ఞాన కేంద్రంలలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలి మరియు యంత్రాలను రైతులకు సబ్సిడీ మీద అందజేయడం వల్ల రైతులు తమ పొలాల్లో పంటను సకాలంలో పూర్తి చేసుకోవచ్చు మరియు పంటలను వర్షాల నుండి కాపాడుకోవచ్చు మరియు యంత్రాలలతో పని త్వరగా చేయడం వల్ల పంట నాణ్యతను మరియు దిగుబడి ని పెంచుకోవచ్చు దీని ద్వారా రైతు లు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
Leave Your Comments