మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రకాల పండ్లు ఉంటాయి. జామకాయ లాంటివి సంవత్సరమంతా కాస్తాయి. మామిడి లాంటివి సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్. కాస్త రేటు ఎక్కువైనప్పటికీ.. పండ్లను తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
కండరాలు, నరాల బలహీనత వంటి సమస్యలతో బాధపడుతుంటే.. జామకాయలు తినడం మేలు.
శ్వాస సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఉల్లిపాయలు ఎక్కువగా తినాలి.
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తరచుగా కూరల్లో టమాటాలు వాడితే సరి.
ఇన్సులిన్ ఉత్పత్తి పెరగాలంటే ఆవాలు వాడాలి. డయాబెటిస్ పేషేంట్లకు ఆవాలు మేలు చేస్తాయి.
కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే మామిడిపండ్లు తినాలి.
కడుపులో పురుగులు పోవాలంటే నేరేడు పండ్లను తినడం మేలు.
కీళ్ళనొప్పుల సమస్యలకు చెక్ పెట్టాలంటే ద్రాక్ష పండ్లు తింటే సరి.
చక్కటి జుట్టు కావాలంటే దోసకాయలు, కీర దోసకాయలు తినాలి.
ఫైల్స్ సమస్య వేధిస్తూ ఉంటే.. బొప్పాయి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుండె, చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది పుచ్చకాయ.
పండ్లతో కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments