అంతర్జాతీయంచీడపీడల యాజమాన్యంవార్తలువ్యవసాయ పంటలు

మిరప నల్ల తామర పురుగుపై విస్తృత శ్రేణి ప్రచారం…క్యాబి ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం

0
క్యాబి (CABI) అనేది అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ. జ్ఞానం, విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా క్యాబి పేదరికం, ఆకలి, విద్య, సమానత్వం, స్థిరత్వం, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తుంది. రైతులు అధికోత్పత్తి చేయడానికి, ఉత్పత్తి చేసిన దానిలో నష్టనివారణకు, చీడపీడల నుంచి వ్యవసాయం, పర్యావరణానికి ముప్పును ఎదుర్కోవడం, ఆక్రమణ జాతుల నుంచి సహజ ఆవాసాలను రక్షించడం, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా క్యాబి దీన్ని చేస్తుంది.ప్లాంట్‌వైజ్‌ప్లస్:
ప్లాంట్‌వైజ్‌ప్లస్ అనేది క్యాబి నేతృత్వంలోని ప్రపంచవ్యాప్త కార్యక్రమం. ఇది సుస్థిరమైన పంట ఉత్పత్తి పద్ధతుల ద్వారా జీవవైవిధ్య నష్టాన్ని తగ్గిస్తూ చిన్న కమతాల రైతుల ఆదాయాలను పెంచడానికి,  ఆహార భద్రత, నాణ్యత మెరుగుపరచడానికి సాధికారతనిస్తుంది.

నేపథ్యం:
చిన్న కమతాల రైతులు ఆచరణాత్మక సలహా సమాచారాన్ని పొందడానికి విస్తరణ సేవలు, ఇతర వ్యవసాయ సేవలను అందించే వారిపై ఆధారపడతారు. ఈ రైతుల విస్తృత అవసరాలను తీర్చడానికి సలహాదారులు సరైన నిర్ణయం తీసుకునే  సమాచారాన్ని పొందగలగాలి. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ సలహా సేవలు, సాధనాలు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ ఈ సేవలు, ఉత్పత్తులు చాలా వరకు మహిళలతో సహా సలహాదారులను చేరుకోవడానికి కష్టపడుతున్నాయి.ప్లాంట్‌వైజ్‌ప్లస్ వ్యవసాయ సేవలను అందించేవారిని లింగసమాన వనరులు, నిర్ణయ మద్దతు సాధనాలతో సన్నద్ధం చేస్తుంది. మొక్కల ఆరోగ్య పర్యవేక్షణ, నిర్వహణ కోసం అవసరమైన సమాచారం, అభ్యాస సామాగ్రి సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తుంది.

విస్తృత విస్తరణ ప్రచారం గురించి…
విస్తృత విస్తరణ ప్రచారం అంటే మాస్ ఎక్స్‌టెన్షన్ క్యాంపెయిన్. క్యాబి, భాగస్వాముల సహకారంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మిరప పంటను ఆశించే తామర పురుగు ఆగ్నేయాసియా త్రిప్స్ పర్విస్పినస్ నుంచి ఏర్పడుతున్న ప్రధాన ముప్పునకు ప్రతిస్పందనగా సమాచార ప్రచారానికి మద్దతునిస్తోంది.

ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలకం !
మిరప ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో భారతదేశానిది ప్రముఖ స్థానం. మనదేశ మిరపకాయ ఘాటైన రుచి, రంగుకు ప్రసిద్ధి చెందింది. భరత్  ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాలలో ఇది 42 శాతం వాటాను కలిగి ఉంది.
మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేస్తుంది.
మిరపలో కొత్త రకం త్రిప్స్:
2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త త్రిప్స్ జాతి(త్రిప్స్ పార్విస్పినస్‌గా)ని గుర్తించారు. దీనిని సాధారణంగా మిరప నల్ల తామర పురుగు (చిల్లీ బ్లాక్ త్రిప్స్- సి.బి.టి.) అని పిలుస్తారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. సి.బి.టి. అనేది ఆగ్నేయాసియా నుంచి వచ్చిన చీల్చి రసం పీల్చే పురుగు. బొప్పాయిపై 2015లో భారతదేశంలో మొదటిసారిగా దీనిని నివేదించారు. ఈ పురుగులు కణజాలాలను తినే ముందు లేత ఆకులు, పూలను చీల్చివేస్తాయి. ముఖ్యంగా పువ్వు చీలికలు, పండ్ల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. సి.బి.టి. అనేది పాలిఫాగస్. అంటే ఇది వివిధ వృక్ష జాతులను ఆహారంగా తీసుకోగలదు. మిరపతో పాటు పత్తి, కంది, మినుములు, మామిడి, పుచ్చకాయ, ఇతర పంటలను దెబ్బతీస్తుంది.2022లో సి.బి.టి. ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను గణనీయంగా దెబ్బతీసింది. తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో అంచనా నష్టాలు 85 నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. ఇది ఊహించని విధంగా సంభవించడం, నష్టం అధిక తీవ్రత కారణంగా రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను ప్రయోగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దీనికి ఖర్చు ఎక్కువ. ఉపయోగం తక్కువ. పైగా సి.బి.టి. ద్వారా దెబ్బతిన్న మిర్చికి మార్కెట్లో తక్కువ ధర లభిస్తుంది. దీంతో ఇది చాలా మంది రైతులను నష్టాల అంచుకు నెట్టింది.

మూడు రాష్ట్రాల్లో ప్రచారం:
గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో చిల్లీ బ్లాక్ త్రిప్స్ పై ప్రచారం జరుగుతోంది. ప్రచారం ప్రధాన లక్ష్యాలు త్రిప్స్ పార్విస్పినస్ గురించి అవగాహన కల్పించడం, క్యాబి డిజిటల్ టూల్స్ ద్వారా సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సురక్షితంగా ఎలా యాజమాన్యం చేయవచ్చు. రైతులు, ఇతరులు తమకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఉపయోగించవచ్చు. క్యాంపెయిన్ ద్వారా కనీసం 6000 మంది రైతులను చేరుకోవాలని క్యాబి లక్ష్యంగా పెట్టుకుంది.
దీని కోసం క్యాబి భాగస్వాములతో కలిసి పెస్ట్ మేనేజ్‌మెంట్ డెసిషన్ గైడ్ (PMDG) ని అభివృద్ధి చేసింది. ఇది త్రిప్స్ పార్విస్‌పినస్‌ను గుర్తించి, సురక్షితమైన యాజమాన్యంపై సలహాలను అందిస్తుంది. భారతదేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక బయోపెస్టిసైడ్ ఎంపికలను కలిగి ఉంది. పురుగుమందుల అనర్ధాలను తగ్గించడానికి వీటిని ప్రోత్సహిస్తున్నాం. PMDGలు ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషలలో రైతులు, విస్తరణ కార్యకర్తల ఉపయోగం కోసం అందుబాటులో ఉన్నాయి.విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, రైతులు, పరిశోధకులు కింది డిజిటల్ సలహా సాధనాలను పొందడం ద్వారా క్యాబి డిజిటల్ సాధనాలను మరింత సమర్థవంతంగా, త్వరగా ఉపయోగించడం ద్వారా త్రిప్స్ పార్విస్‌పినస్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మధు మంజరి,
అగ్రి-డిజిటల్ టూల్స్ కోఆర్డినేటర్,
దక్షిణాసియా, క్యాబి.
Leave Your Comments

లాభదాయకంగా పుట్టగొడుగుల పెంపకం  

Previous article

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

Next article

You may also like