వార్తలు

అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
లక్ష్యం : కంది @ 20 లక్షల ఎకరాలు, పత్తి @ 75 లక్షల ఎకరాలు
రాష్ట్రంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
వరి సాగు వద్దు.. కంది, పత్తి, నూనెగింజల సాగు మేలు.
రైతాంగాన్ని క్షేత్ర స్థాయిలో చైతన్యం చేయండి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు భీమా, సాగునీటి రాకతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ సభ, సమావేశంలో వరి సాగు తగ్గించాలని రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
జాతీయంగా, అంతర్జాతీయంగా నూనెగింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
విత్తన కంపెనీలు నూనెగింజల విత్తనాలను విస్తృతంగా రైతులకు అందుబాటులో ఉంచాలి.
వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ విషయాలను బలంగా రైతుల్లోకి తీసుకువెళ్లాలి.. రాబోయే రెండు నెలలు వ్యవసాయ శాఖ సిబ్బంది సమయస్ఫూర్తితో పనిచేయాలి. రానున్న వానాకాలం లో కంది 20 లక్షల ఎకరాలకు, పత్తి సాగు 75 లక్షల ఎకరాలకు పెంచాలి.
దీనికి అనుగుణంగా 57 పత్తి విత్తన కంపెనీల ద్వారా 170 లక్షల నాణ్యమైన పత్తి విత్తన ప్యాకెట్లు నిర్ణీత సమయానికి సిద్ధంగా అందుబాటులో ఉంచాలని ఆదేశం
నకిలీ పత్తి విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోండి.
20 లక్షల ఎకరాలలో కంది సాగుకు అనుగుణంగా రాష్ట్ర, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు, వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఇతర ప్రైవేటు కంపెనీల ద్వారా 80 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలి.
దేశంలో తొలిసారి క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో రైతులకు
మొత్తం 90 లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు 22 లక్షల క్వింటాళ్ల ధృవీకరించిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
మే 15 వరకు విత్తనాలన్నీ జిల్లాలలో అందుబాటులో ఉండాలి.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలు .. అక్రమార్కులపై పీడీ యాక్ట్.
పత్తి సాగు మీద జిల్లాల వారీగా సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక అందజేయాలి.
అన్ని జిల్లాల కలెక్టర్లు కళాజాత బృందాలతో రైతులను చైతన్యం చేయాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, జేడీఎ బాలు, డీడీఎ శివ ప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు తదితరులు

 

Leave Your Comments

తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ రంగంలో యువతకు ఉచిత శిక్షణ

Previous article

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు

Next article

You may also like