నీటి వసతి ఉన్న రైతులు రబీ వేరుశనగ విత్తుకోవటానికి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమైన సమయం. అలాగే రైతులు కిలో వేరుశనగ విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ + 3 గ్రా. మాంకోజెబ్ చొప్పున కలిపి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధిచేసి, నీడలో ఆరబెట్టి తర్వాత శిలీంధ్ర నాశినితో శుద్ధి చేయాలి. విత్తిన 24- 48 గంటల లోపు 1.0-1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30 శాతం కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటలను 4 నుంచి 5 వరుసలలో విత్తుకొని రసం పీల్చు పురుగుల వలసను నియంత్రించవచ్చని అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Leave Your Comments