రైతుల సంక్షేమం, ప్రాధాన్యతల దృష్ట్యా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సి.సి.ఐ. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) లలిత్ కుమార్ గుప్త రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యులతో మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సి.సి.ఐ. ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలుపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలను చర్చించి పరిష్కరించారు. తదనుగుణంగా రాష్ట్రంలో పత్తి మార్కెట్లు, సి.సి.ఐ. కోనుగోలు కేంద్రాల వద్ద యధాతధంగా కోనుగోళ్ళు జరుగుతాయి. కావున రైతులు అందళోన చెందనవసరం లేదని, రైతులు వారికి దగ్గరగా ఉన్న సి.సి.ఐ. కోనుగోలు కేంద్రాల వద్ద తమ పత్తి పంటను నేరుగా అమ్ముకోవచ్చని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది
సి.సి.ఐ. కోనుగోలు కేంద్రాల వద్ద పత్తి కొనుగోళ్లు యథాతథం !
Leave Your Comments