తెలంగాణరైతులు

పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం

0
Cotton : పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం
– మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి కొనుగోళ్ళకు సంబంధిత సమాచారం అందించేందుకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదన్న మంత్రి ఆదేశాల మేరకు ఈ వాట్స్ యాప్ సేవలు ప్రారంభించారు. 8897281111 అనే వాట్స్ యాప్ నెంబర్ ద్వారా పత్తి రైతులు పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అంటే పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల తక్ పట్టి వివరాలు, చెల్లింపు స్థితి, కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సి.సి.ఐ.) సెంటర్లలో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు వంటి అంశాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్స్ యాప్ చాట్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు.
పింజ రకాన్ని బట్టి ధర:
పింజ రకం(BB MODE) ఒక క్వింటాలుకు  రూ.7521/- , (పింజ పొడువు 29.5 నుంచి 30.5 మి. మీ, మైక్రోనీర్ విలువ 3.5 నుంచి 4.3 గా), పింజ రకం(BB SPL) ఒక క్వింటాలుకు  రూ.7471/- , (పింజ పొడువు 29.01 నుంచి 29.49 మి. మీ, మైక్రోనీర్ విలువ 3.6 నుంచి 4.8 గా), పింజ రకం (MECH) ఒక క్వింటాలుకు రూ. 7421/- (పింజ పొడువు 27.05 నుంచి 28.5 మి. మీ., మైక్రోనీర్ విలువ 3.5 నుంచి 4.7 గా) పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
తేమ శాతం పెరిగితే ధర తగ్గుతుంది:
పత్తిలో తేమ శాతం 12% మించకుండా ఉండి, 8% నుంచి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. కావున రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్దారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాల వద్ద అమ్ముకోవాలని మంత్రి  సూచించారు.
 ఫిర్యాదులూ చేయొచ్చు..
ఈ పత్తి సీజన్ లో రైతులు వారి పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని,  రైతులందరు మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్స్ యాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని మంత్రి  రైతులని కోరారు. అలాగే రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా ఈ వాట్సాప్ చాట్ ద్వారా తెలియపరిస్తే, మార్కెటింగ్ శాఖ వారు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి తెలియజేశారు.
Leave Your Comments

ఏపీలో పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన  వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు 

Previous article

అగ్రి ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు మలేషియా వ్యవసాయ మంత్రిని కోరిన తుమ్మల

Next article

You may also like