జాతీయంవార్తలువార్తలు

ఆరు రబీ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం  

0

The Center has increased the support price of six Rabi crops : రబీలో సాగుచేసే ఆరు పంటల మద్దతు ధరను పెంచి కేంద్ర సర్కారు రైతులకు తీపి కబురు అందించింది. గోధుమ, శనగ, కుసుమ, మసూర్ దాల్, ఆవాలు, బార్లీ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే శనగల ధర క్వింటా శనగల కనీస మద్దతు ధర రూ. 5,440 నుంచి రూ. 5,650 కి (రూ.210 పెంపు)పెరగనుంది. అలాగే క్వింటా కుసుమల ధర రూ.5800 నుంచి రూ.5940 (పెంపు రూ.140 ), గోధుమలు రూ.2275 నుంచి రూ.2425 (రూ.150 పెంపు), ఆవాలు రూ. 5650 నుంచి రూ.5950 (రూ. 300 పెంపు), మసూర్ దాల్ రూ.6425 నుంచి రూ.6700 (రూ.275 పెంపు), బార్లీ రూ.1850 నుంచి రూ.1980 లకు(రూ.130 పెంపు) పెంచింది.    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం (అక్టోబర్16 న) జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్నికేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే మార్కెటింగ్ కోసం ఈ ధరలు వర్తిస్తాయి.

Leave Your Comments

చెంచలి ఆకులో ఎన్నో పోషకాలు – మరెన్నో ఔషధ గుణాలు

Previous article

ఉభయ అనంతపురం, కర్నూల్ జిల్లాల రైతులు ఈ జాగ్రత్తలు పాటించండి !

Next article

You may also like