మన వ్యవసాయం

Scientist’s advice to pulse farmers : శనగ పంట సాగుచేసే రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

0

Scientist’s advice to pulse farmers : శనగ పంటలో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం గల రకాలను ఎంచుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి వీలుంటుందని అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు… డా.ఎం. విజయ్ శంకర్ బాబు,
డా.జి. నారాయణ స్వామి, డా.జి.డి. ఉమాదేవి రైతులకు సూచిస్తున్నారు.  శనగపంట సాగుచేసే రకాన్ని బట్టి మూడు నుంచి మూడున్నర మాసాల్లో పంటకొస్తుంది. నల్లరేగడి నేలల్లో నిలువ ఉన్న తేమను ఉపయోగించుకుంటూ, శీతాకాలంలో కురిసే మంచుతో పెరుగుతుంది. శనగ పప్పుధాన్యపు పైరు గనుక భూమిలో నత్రజని స్థిరీకరించడంతో భూసారం పెరుగుతుంది.

రకాల ఎంపిక – సాగులో…
శనగ పంట వేయాలనుకుంటున్నరైతులు అక్టోబర్ రెండవ పక్షం నుంచి  నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. అలగే అధిక దిగుబడి ఇచ్చే  నంద్యాల గ్రామ్ 1267 (ఎన్ బి ఇ జి.1267), నంద్యాల గ్రామ్ 776 (ఎన్ బి ఇ జి. 776), నంద్యాల గ్రామ్ 857 (ఎన్ బి ఇ జి. 857), నంద్యాల గ్రామ్ 452 (ఎన్ బి ఇ జి. 452), నంద్యాల గ్రామ్ 49 (ఎన్ బి ఇ జి. 49), ధీర (ఎన్ బి ఇ జి. 47), నంద్యాల  శనగలు (ఎన్ బి ఇ జి. 3), జె.జి. 11, జె.ఏ.కె.ఐ. 9218 వంటి రకాలను ఎన్నుకోవాలి. ఎకరానికి 30 నుంచి 35 కిలోల విత్తనం వాడాలి. శనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా నిర్దిష్ట సఖ్యలో మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మ విరిడి పొడిని మరియు థైరమ్ 3 గ్రా. లేదా కార్చెండాజిమ్ 2.5 గ్రా. తో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు.

Read More :Bengal Gram Cultivation: ఈ పంటను సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది…

కలుపు నివారణకు పెండిమిథాలిన్ 1000 నుంచి 1400 మి.లీ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారి చేయాలి. అలాగే సకాలంలో తెగుళ్లు, కీటకాల ఉధృతి గమనించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. పంటకాలంలో బెట్ట పరిస్థితులు వస్తే పొటాషియం నైట్రేట్ 5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నీటి వసతి ఉన్న రైతులు పంట విత్తిన 30-35 రోజులకు నీరు ఇవ్వడం వల్ల అధిక దిగుబడి పొందటానికి ఆస్కారం ఉంటుంది. శనగలో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం గల   రకాలను ఎంచుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి వీలుంటుంది.

Leave Your Comments

How to prepare Jivamruta at farmer level? : రైతుస్థాయిలో జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి ?

Previous article

A new type of cowpea suitable for machine harvesting from Nandyala : నంద్యాల నుంచి యంత్రం కోతకు అనువైన కొత్త శనగ రకం

Next article

You may also like