Integrated crop protection measures:
డా. రాజు సమగ్ర సస్య రక్షణ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్ర, మామునూరు మరియు డా. రాజన్న ప్రోగ్రాం కొఆర్డినేటర్, కృషి విజ్ఞాన్ కేంద్రం, మమునూర్
కృషి విజ్ఞాన్ కేంద్రం మామునూరు శాస్త్రవేత్తల బృందం డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో” ప్రథమ శ్రేణి సందర్శనలో భాగంగా” వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణ కోసం “లింగార్క్షక ఎరలను” రైతు పొలంలో అమర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా. రాజు సస్య రక్షణ శాస్త్రవేత్త సమగ్ర సస్యరక్షణ చర్యలలో లింగాకర్సక ఎరలు చీడలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుయని అలాగే వాటిని పొలం లో అమర్చే విధానన్ని రైతులకు వివరించారు. వీటి వలన మిత్ర పురుగులకు మరియు పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. కాబట్టి ప్రస్తుత కాలంలో రైతులు చీడ పీడల పైన అవగాహన పెంచుకొని లింగాకర్షకా ఎరాలను వివిధ పంటలలో ఉపయోగించాలని మరియు వీటిని ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.
లింగాకర్షణ ఎరలుఅంటే ఏమిటి ?
లింగాకర్షణ బుట్టలను ఉపయోగించి పురుగులను ముందుగా గుర్తించవచ్చును. వాటి సంఖ్యను కూడా లెక్కించవచ్చును. పురుగులు ఇతర పురుగులను గుర్తించుట మరియు ఒకదానితో మరోఒకటి సంభాషించుకొనుటకు కొన్ని రకాల ఫెరామోన్లను ఉపయోగించుకుంటాయి. ఈ పిరామోన్లను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసి ఎరలో ఉంచడం ద్వారా మగపురగుని ఆకర్షించి బుట్టలో బంధించడం జరుగుతుంది. ఈ బుట్టలనే లింగాకర్షణ ఎరలు అంటారు.
లింగాకర్షణ బుట్టలు:
తక్కువ ఖర్చుతో పురుగులను సమర్ధంగా నివారిస్థాయి. ఈ పద్ధతిలో పురుగులను ముందుగా గుర్తించవచ్చును. దీని ఆధారంగా తక్కువ కర్చుతో కూడుకున్న యాజమాన్య పద్దతి సరియైన సమయంలో ఉపయోగించ వచ్చును. అంతేకాకుండా వాటి ఉధృతిని మరియు సంఖ్యను కూడా లెక్కించివచ్చును. దీని ఆధారంగా పంట నష్టాన్ని మరియు దిగుబడిని లెక్కించవచ్చును.
లింగాకర్షణ బుట్టల వాడకం వలన కలుగు ప్రయోజనాలు :
- లింగాకర్షణ బుట్టలు తల్లి పురుగులు గ్రుడ్లు పెట్టక ముందే వాటి ఉనికిని తెలియజెస్తయి. దీని ఆధారంగా పురుగుల ఉదృతి పెరగక ముందే అరికట్టవచ్చును.
- లింగాకర్షణ బుట్టలు తల్లి పురుగుల సంఖ్యను, ఉనికిని తెలియజెస్తయి.
- మగ రెక్కల పురుగులను ఆకర్షించి, ఆడ రెక్కల పురుగులతో సంయోగం జరగకుండా చేస్తాయి తద్వారా ఆడపురుగు గ్రుడ్లు పెట్టకముందే చనిపోతుంది దీని ద్వారా పురుగు తర్వాత సంతతి చాలా వరకు తగ్గుతుంది.
- లింగాకర్షణ బుట్టలతో రసాయనాలను ఉంచడం ద్వారా మగ పురుగులను చంపవచ్చును.
- పంటలకు మేలు చేయు మిత్ర పురుగులను మరియు పర్యావరణానికి ఎలాంటి హాని చేయకపోవడం వలన సేంద్రియ వ్యవసాయంలో పంటను నష్ట పరిచే పురుగులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
వివిధ పురుగులకు లభించే లింగాకర్షణ ఎరలు వాటి రసాయన నామాలు :
- వరి పంటలో మొగి పురుగు/కాండం తొలుచు పురుగు నివారణకు Z-11-హెక్సాడెసెనల్ అసిటేట్ మరియు Z-9-హెక్సాడెసెనల్ అసిటేట్ వాడాలి.
- మొక్కజొన్న / జొన్న కాండం తొలుచు పురుగు నివారించడానికి “2- ఎక్సాడేసినిల్” అనే ఫెరమోనే కావాలి.
- గులాబీ రంగు కాండం తొలుచు పురుగు, చెఱుకు కాండం తొలుచు పురుగు నివారించడానికి- “2 ఎక్సాడెసినాల్”
- క్యాబేజి రెక్కల పురుగు లేదా లద్దెపురుగు – 9’11 టెట్రా డెకాడైయినైల్ ఎసిటేట్.
- పచ్చపురుగు, వంగ కాండం తొలుచు పురుగు, వరి రెల్ల తొల్చుపురుగు, వేరుశనగ ఆకుముడత పురుగు కి – “7,9 డెకాడైయినైల్ ఎసిటేట్” చెఱుకు పీక పురుగు కి – 13. అక్టోడెసినైల్ ఎసిటేట్, 7-13 అక్టోడెసినోల్ -1.
లింగాకర్షణ బుట్టల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- పంట ముప్పై రోజుల వయసు నుండి వాడవలెను.
- ఎకరానికి 8 ఎరలను అమర్చాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 10 వరకు అమర్చాలి.
- లింగాకర్షణ బుట్టలలో ఉండే (లూర్) రసాయనాన్ని 22 రోజులకి ఒకసారి మార్చాలి
- ఎరలను అమర్చేటప్పుడు చేతులకు ఎటువంటి వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచువలెను.
- బుట్టలలో పడిన పురుగులను ప్రతి 2-3 రోజులకు ఒకసారి లెక్కించి వాటి సంఖ్యను లెక్కగట్టాలి. దీని ఆధారంగా సమగ్ర సస్య రక్షణ చర్యలను ఎంచుకోవాలి.
- ఎరాలని పంట పైన ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి.