ఆరోగ్యం / జీవన విధానం

రామాఫలం ఆరోగ్య ప్రయోజనాలు..

0

సీతాఫలం గురించి అందరికీ తెలుసు. రామాఫలం గురించి కొందరికే తెలుసు. అరుదుగా లభించే ఈ పండులో పోషక విలువలు మెండు. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
సీతాఫలం తీపి ఫలమైతే రామాఫలంలో తియ్యదనం తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి కూడా.
రామాఫలంలోని విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ముఖంపై మొటిమలను నివారిస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ పండు ద్వారా లభించే మంచి కొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది.
ఇందులోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు సహజ యాంటీ బయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగిన రామాఫలం విరేచనాలను నియంత్రిస్తుంది. న్యుమోనియా, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకూ ఔషధంగా పనిచేస్తుంది.
ఇందులోని కాల్షియం ఎముకలకు సత్తువనిస్తుంది. ఎముకలు పెళుసు బారడం, కీళ్ళనొప్పుల సమస్యలు దూరమవుతాయి.
చర్మం అక్కడక్కడ నలుపు రంగులోకి మారే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య నివారణకు రామాఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే నలుపు మటుమాయం అవుతుంది. రామాఫలాన్ని తినడమే కాదు ఈ పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పేగులను శుభ్రం చేసి జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దురద తగ్గించడంలో, చర్మ సంరక్షణలో, వార్ధక్య ఛాయలను నియంత్రించడంలో రామాఫలం ఔషధంగా పనిచేస్తుంది. అరుదుగా లభించే ఈ పండు దొరికితే తినకుండా వదలొద్దని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

Leave Your Comments

ప్రకృతిపై ప్రేమతో వినూత్నంగా ఆలోచించిన ఆటో డ్రైవర్ జక్రయ్య..

Previous article

పుట్టగొడుగులు, నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి..

Next article

You may also like