ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలువ్యవసాయ పంటలు

PADDY: వానాకాలం వరిలో సమస్యల్ని ఎలా అధిగమించాలి ? వరి సాగుచేస్తున్నరైతులకు సస్యరక్షణ సూచనలు

0

PADDY: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరి పంటలో వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. వరి సాగుచేస్తున్న రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలా రాణి ఇలా తెలియజేస్తున్నారు.

>ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 జి గుళికలను వరి నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు, పొట్ట దశలో 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ.టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుంచి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2గ్రా. + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

>వరిలో ఆకుముడత గమనించిన ప్రాంతాల్లో నివారణకు 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.1మి.లీ. ప్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట్ల నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజేబ్ మిశ్రమ మందు 2.5గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ALSO READ: Paddy Crop: వరి పంటలో పురుగుల బెడద ఉందా? ఈ నివారణ చర్యలు పాటించండి..

>వరిలో జింక్ ధాతువు లోపం గమనిస్తే నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా. లేదా డైనోటేఫ్యూరాన్ 0.4గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో పాముపొడ తెగులు ఆశించవచ్చు. దీని నివారణకు 2 మి.లీ.హెక్సాకొనజోల్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 0.4 గ్రా. టెబుకోనజోల్ + ట్రైప్లోక్సిస్ట్రోబిన్ 75 డబ్ల్యు. జి. చొప్పున లీటరు నీటికి కలిపి పైరు మొదళ్లు తడిచేలా పిచికారి చేయాలి.

Leave Your Comments

USES OF DRUMSTICK LEAVES: మీకు తెలుసా ? మునగ ఆకుల్లో మంచి పోషక, ఔషధ గుణాలు !

Previous article

You may also like