రైతులువార్తలు

COTTON: పత్తి పంటకు చీడపీడల ముప్పు ! రైతులు చేపట్టాల్సిన నివారణ చర్యలు

0

COTTON: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో వివిధ రకాల పురుగులు,తెగుళ్లు ఆశిస్తున్నాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.పి. లీలా రాణి ఇలా తెలియజేస్తున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మూడవ దఫా, నాల్గవ దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 60, 80 రోజుల దశలో పంటకు అందించాలి. ఆలస్యంగా విత్తిన వర్షాధార పంటలో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డు సాళ్ళు వేసుకోవాలి. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పత్తిలో వడలు తెగులు కనిపిస్తుంది. దీని నివారణకు మురుగు నీటిని తీసివేయడంతో పాటు పైపాటుగా 10గ్రాముల చొప్పున 13-0-45 ను లీటరు నీటికి కలిపి 2- 3రోజుల వ్యవధిలో పిచికారి చేయడంతో పాటు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ నేల తడిచేలా పోయాలి.

> ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో పచ్చదోమ, తామర పురుగులు ఆశించటానికి అనుకూలం. వీటి నివారణకు పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 5 మి.లీ. 1500 పి.పి.ఎం.వేపనూనె, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ లేదా 0.3గ్రా. ఫ్లునికామిడ్ లేదా 0.75మి.లీ. సల్పాక్సాప్లోర్ మందును 5మి.లీ. 1500 పీపీఎం వేపనూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

> కొన్నిచోట్ల పత్తిలో పిండినల్లి ఆశించింది. దీని నివారణకు పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను నివారించాలి. 3 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2గ్రా. ఎసిఫేట్ తో 1మి.లీ. ట్రైటాన్ లేదా శాండోవిట్ లేదా 0.5 – 1.0 గ్రాము సర్ఫ్ ను లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలో కాయకుళ్ళు కనిపిస్తోంది. దీని నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1మి.లీ. క్రిసాక్సిమిథైల్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

>ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. దీని నివారణకు పొలం గట్లమీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి.
రైతులందరు సామూహికంగా ఎకరాకు 8-10 లింగాకర్షక బుట్టలను పెట్టి రెక్కల పురుగులను బందిం చాలి లేదా ఎకరాకు 4 లిగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజులలో బుట్టకు 7- 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు 2మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరిపైరిఫాస్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందుల పిచికారి ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4గంటల తర్వాత చేసుకోవాలి.

>పత్తిలో టొబాకోస్ట్రీక్ వైరస్ తెగులు గమనించడమైంది. దీని నివారణకు గట్ల వెంబడి ఉండే వయ్యారిభామ కలుపు మొక్కలను పూతకు రాకముందే పీకి తగులబెట్టాలి. తామర పురుగులను అరికట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చు. తామర పురుగుల నివారణకు 5మి.లీ. 1500 పిపిఎం వేపనూనె, 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2గ్రా. ఎసిటామిప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు మార్చి మార్చి మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారి చేయాలి.

ALSO READ :Weed Control In Cotton Crop: పత్తిలో కలుపు నివారణ

Leave Your Comments

ANGRU: ఏపీలో ఖరీఫ్ పంటల అంచనా ధరలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎలా ఉండొచ్చు !

Previous article

USES OF DRUMSTICK LEAVES: మీకు తెలుసా ? మునగ ఆకుల్లో మంచి పోషక, ఔషధ గుణాలు !

Next article

You may also like