పరిహారం ప్రహసనం కాకుండా చర్యలు –
రైతుకు తక్షణ సాయం అందించేందుకు డిజిటల్ అప్లికేషన్ –
దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పెట్టుబడి రాయితీలో డిజిటల్ సేవలు –
రైతుకు న్యాయం చేసేందుకే తక్షణ సాయమన్న మంత్రి అచ్చెన్నాయుడు –
వ్యవసాయ, ఉద్యాన పంట నష్టం కింద 381.75 కోట్ల అంచనా –
వరి రైతుకు ముఖ్యమంత్రి రూ.10 వేలు ప్రకటనతో అదనపు సాయం-
పంట దిగుబడి సమయంలో బీమా ద్వారా మరింత తోడ్పాటు –
వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్
Paddy Cultivation Farmers: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రహసనంగా మారుతున్నాయని, రైతులకు పంట నష్టపరిహారం కింద పెట్టుబడి రాయితీ అందించే విధానంలో డిజిటల్ అప్లికేషన్ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దేశంలోనే తొలిసారి మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం పారదర్శకంగా అందించేందుకు నూతన డిజిటల్ విధానంలో యాప్ అందుబాటులోకి తెచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియచేశారు.
ఇటీవల సంభవించిన వరదలు, భారా వర్షాలు, గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, సంభవించిన పంట నష్టం, డిజిటల్ విధానంలో రూపొందించిన వెబ్ అప్లికేషన్ తదితర ప్రధాన అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమీషనర్ ఢిల్లీరావు, ఉద్యాన శాఖ కమీషనర్ శ్రీనివాసులు వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం టెలీ కాన్ఫనెన్స్ నిర్వహించారు.
రైతులకు పంట దిగుబడి వచ్చే సమయంలో విపత్తుల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బీమా చెల్లిస్తామని, ప్రస్తుతం నష్టపోయిన రైతులకు అందించే ప్రభుత్వ సాయంతో పాటు దిగుబడి సమయంలో ఇచ్చే బీమా రైతులకు తోడ్పాటుగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు..
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమీషనర్ ఢీల్లీ రావు సంభవించిన పంట నష్టం వివరాల రియల్ టైమ్ నమోదు ప్రక్రియ, యాప్ సేవలను మంత్రి అచ్చెన్నాయుడుకి వివరించారు. ఇప్పుడు రూపొందించిన యాప్ ద్వారా పారదర్శకమైన డాటా నమోదు జరుగుతుందని, భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుందని కమీషనర్ ఢిల్లీ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ 2.06 లక్షల హెక్టార్లలో, ఉద్యాన శాఖ 19,735 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు పారథమిక అంచనా సిద్దం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.8 లక్షల మంది రైతులు వర్షాలు, వరదల కారణంగా నష్టపోయినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.390.12 కోట్ల అంచనా సిద్ధం చేశామని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో యాప్ లో వివరాలు నమోదు చేయడం ద్వారా తక్షణ సాయం అందించడంతో పాటు రైతులకు శాస్త్రవేత్తల సూచనలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రైతులకు విపత్తుల సమయంలో జరిగే నష్టం వెలకట్టలేనిదని, పెట్టుబడి రాయితీ కింద అందించే సాయం త్వరితగతిన ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో యాప్ రూపొందించామని అన్నారు. క్షేత్ర స్థాయిలో రైతలకు వాటిల్లిన నష్టం అధికారులు యాప్ లో నమోదు చేయడం, అనంతరం ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించడం ద్వారా పారదర్శకంగా నష్ట పరిహారం చెల్లింపులు జరుగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరి సాగు చేస్తూ విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం అందిస్తామన్న నిర్ణయంతో మరికొంత సాయం చేకూరుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వ సాయం అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారులు తరచూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
బీమాతో అదనపు రక్షణ : రైతులకు ప్రకృతి విపత్తుల కారణంగా ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీతో పాటు పంట దిగుబడి వచ్చే సమయంలో బీమా కంపెనీలు చెల్లించే బీమా సొమ్ము రైతులకు అదనపు రక్షణగా మారుతుందని, పంటల బీమా పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇట్లు
కింజరాపు అచ్చెన్నాయుడు గారి కార్యాలయం
Also Read: Paddy Crop: వరి పంటలో పురుగుల బెడద ఉందా? ఈ నివారణ చర్యలు పాటించండి..