తెలంగాణరైతులువార్తలు

Minister Tummala Nageswara Rao: టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.15 వేలుండాలి..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి తుమ్మల విజ్ఞప్తి

1
Minister Tummala Nageswara Rao
Minister Tummala Nageswara Rao

Minister Tummala Nageswara Rao: ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డును భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయాలని,సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజసింగ్ చౌహన్ ని విజ్ఞప్తి చేశారు. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పై మూడు విషయాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు సరైన ధర దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో టన్ను రూ.20వేలు ఉండగా ఇటీవల కాలంలో కష్టం డ్యూటీని ఎత్తివేసారని తెలిపారు. కస్టమ్ డ్యూటీని తగ్గించిన క్రమంలో టన్ను ధర రూ.12 వేలకే కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కనీసం మద్దతు ధర 2024-25 సంవత్సరంలో టన్నుకు రూ.15,000 రూపాయలు ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా తెలంగాణకు కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు.దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు త్వరలోనే పై మూడు విజ్ఞప్తులకు సంబందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Minister Tummala Nageswara Rao

Palm Oil Tree

Leave Your Comments

Horticulture: ఉద్యాన పంటల సాగుదార్లకు శాస్త్రవేత్తల సూచనలు

Previous article

PJTSAU: భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల సంరక్షణ-సూచనలు

Next article

You may also like