Preventions to be taken for coconut:అధిక వర్షాల నేపత్యంలో కొబ్బరి తోటల్లో చేపట్టాల్సిన చర్యలు, సలహాలను డా.వై.ఎస్.ఆర్.ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తలు ఇలా తెలియజేస్తున్నారు.
తోటల్లో అధికంగా ఉన్న నీటిని వెంటనే తీసి బయటకు పంపే ఏర్పాటు చేయాలి.అధిక వర్షాలకు నీట మునిగిన కొబ్బరి తోటల్లో మొవ్వు కుళ్ళు సోకే ప్రమాదం ఉంటుంది.
Also Read:Pests In Crops Due To Heavy Rains: వానాకాలం పంటలలో అధిక వర్షాల కారణంగా ఉదృతమయ్యె చీడపీడలు – నివారణ.
ఈ తెగులు సోకిన మొక్కల్లో మొదట మొవ్వు ఆకు, దాని పక్కనున్న రెండు లేదా మూడు ఆకులు వడలిపోతాయి.మొవ్వు నుంచి బయటకొచ్చే భాగంలో ఎండుకుళ్ళు ఏర్పడుతుంది. మొవ్వు ఆకు పసుపురంగుకు మారి ఎండిపోతుంది. ఇతర పరాన్నజీవులు చేరి మొవ్వు పూర్తిగా కుళ్ళి,చెడు వాసన వస్తుంది.ఈ ఆకును లాగితే ఊడివస్తుంది. ఈ కుళ్ళు మొవ్వుఆకు కిందకు వ్యాపించి కొబ్బరి చెట్టులోని అంకురాన్ని ఆశించి, చెట్టు చనిపోతుంది. తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కల్గిస్తుంది.
జీవనియంత్రణ పద్ధతి: కొబ్బరి మొక్క మొవ్వ భాగంలో సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ టాల్క్ పొడిని వేయాలి. మొక్క వయస్సును బట్టి సంవత్సరంలోపు మొక్కకు 5 గ్రా., ఒక సంవత్సరం మొక్కకు 10 గ్రా., అదేవిధంగా 2, 3, 4, 5 ఏళ్ళు ఆపై వయస్సు గల మొక్కలకు 75, 100, 150, 200గ్రా.చొప్పున టాల్క్ పొడిని వేయాలి. కాయకుళ్ళు సోకిన గెలలను తొలగించి ఇతర గెలలు మొవ్వు భాగం తడిచేలా సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.ఈ తెగులు ఆశించే శిలీంధ్ర బీజాలు నేలలో ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు కొబ్బరి మొక్కను ఆశిస్తాయి.కాబట్టి నేలలో ఉన్న శిలీంధ్ర బీజాల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతి ఏడాది చెట్టుకు 50గ్రా.ట్రైకోడెర్మా విరిడీ శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి పాదుల్లో వేసుకోవాలి. దీనివల్ల నేలలో ఉండే శిలీంధ్ర బీజాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా మొక్కకు తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరిలో సాలీనా ఒక్కో చెట్టుకు 1 కిలో యూరియా, 2 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లతో పాటు పశువుల ఎరువు 25 కిలోలు లేదా వర్మి కంపోస్ట్ 10 కిలోలు లేదా వేపపిండి 5 కిలోలు వేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 – 2 మీ. దూరంలో 15 సెం.మీ. లోతున గాడి చేసి, ఎరువులు వేసి, మట్టితో పూడ్చాలి.