కరోనా విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇరు తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. ఇప్పటికే పక్క రాష్ట్రాల వరకు పాకిన ఈ వైరస్ ఎప్పుడు మన రాష్ట్రాలపై వస్తుందని మన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ భయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలు అనూహ్య రీతిలో తగ్గిపోయాయి. చికెన్ అంటేనే దూరం జరుగుతున్నారు మాంస ప్రియులు. దీంతో పౌల్ట్రీ యజమానుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారస్తుల వరకు తీవ్రంగా నష్టపోతున్నారు.
భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితా పెరుగుతోంది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణనైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలా?
బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ మనకు సోకకుండా అడ్డుకోవచ్చును. బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో చాలావరకు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అయితే, ఈ వైరస్‌ల్లో కొన్ని మనుషులకు సోకే అవకాశముంటుంది. అయితే, భారత్‌లో ప్రస్తుతం మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి కేసులూ నిర్ధారణ కాలేదు. అయితే, పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో ఎక్కువసేపు దగ్గరగా గడిపేవారు రక్షణ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పక్షులను స్థానిక ప్రభుత్వాలు వధిస్తున్నాయి. మిగతా పక్షులతోపాటు మనుషులకు ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. హెచ్5ఎన్1 అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.
బర్డ్ ఫ్లూలో హెచ్5ఎన్1 అనేది చాలా కామన్. ఇది పక్షులకి ప్రాణాంతకమైనది, ఈ వైరస్‌ని క్యారీ చేసే వాటివల్ల జంతువులకీ మనుషులకీ కూడా చాలా త్వరగా సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్5ఎన్1 మొదటగా 1997లో మనుషుల్లో గుర్తించారు, ఇది సోకిన వారిలో సుమారుగా అరవై శాతం మంది మరణించారు. ప్రస్తుతం హెచ్5ఎన్1 మనిషి నుండి మనిషికి సోకడం లేదు, కానీ కొంత మంది నిపుణులు మాత్రం ఇది ఒక మహమ్మారిగా తయారవుతుందేమోనని భయపడుతున్నారు.
పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది?
హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. పక్షుల రెట్ట నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి. కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి క్షణాలు కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంటాయి.
కోళ్లలో వ్యాపించిన ఈవ్యాధి 2 రకాల వ్యాధి లక్షణాలు ప్రకోపించవచ్చు. ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినప్పుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రంగా సోకినప్పుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలో చనిపోతుంది.
కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితంగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్ట ద్వారా కూడా ఈవ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షులలో ఈవ్యాధి క్రిములు పేగుల్లో ఉండవచ్చును. కాని దీని ప్రభావము వెంటనే కనిపించదు. ఈ పేగు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షిజాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి.
చికెన్ తినొచ్చా?
మనం చికెన్‌ను 700 ఉష్ణోగ్రతల్లో వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చికెన్, గుడ్లు శుభ్రంగా, పూర్తిగా వండేలా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వీటి నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడు కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.
మనుషులకు ఎలా సోకుతుంది?
ఈ వైరస్ సోకిన పక్షుకు సమీపంలో ఎక్కువ సేపు గడిపినప్పుడు ఈ వైరస్ మనుషుకు సోకుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1918లో లక్ష మంది మరణాలకు కారణమైన స్పానిష్ ఫ్లూ ఇలానే పక్షుల నుంచి మనుషులకు సంక్రమించిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. తాజా కోవిడ్-19 వైరస్ కూడా జన్యుపరివర్తన చెందడంతో మనుషుల మధ్య వ్యాపించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలిగింది.
మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి?
దగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పు, ముక్కు కారడం, గొంతు నొప్పి, మంట లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇటువంటి సమయములో తరచూ చేతులు కడుక్కోవడం, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకోవడం లాంటి చర్యలతో ముప్పును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము లాంటి లక్షణాలు కనిపించే వారి నుంచి సామాజిక దూరం పాటించాలి. కోళ్లు, బాతులకు మీరు ఆహారం వేయొచ్చు. అయితే ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.
మనుషులపై ప్రభావం ఎలా ఉంటుంది?
మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్‌కు, కోళ్లకు సోకే వైరస్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు హెచ్1ఎన్1, హెచ్1ఎన్2, హెచ్3ఎన్2 వైరస్ సోకుతాయి. కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ త్వరితంగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువల్ల మానవ జాతికి మొదట నుండి ఈ వైరస్ అంటే భయమే. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిగా సోకినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది మరణించారు. బర్డ్ ఫ్లూ కూడా అదేవిధంగా రూపాంతరం చెంది మానవులకు హాని కలిగిస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరం నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25-30 శాతం ప్రజలకు దీని ప్రభావం పడుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మానవ జాతిపై ప్రభావము గురించి అలా ఉంచి పక్షులకు ఈ వ్యాధి సోకడం వల్ల అపారమైన ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ వ్యాధి వ్యాపించకుండా కోట్లాది కోళ్లను వధించాల్సివస్తుంది. వ్యాధి సోకిన కోళ్లకు మేత దాణా వేసేవారు, పంజరాలను శుభ్రం చేసేవారు, రోగిష్టి పక్షులను అటూ ఇటూ తరలించేవారికి ఈవ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన దాఖలాలు లేవు. ఇది మానవ జాతికి పెద్ద ఊరట.
నివారణా చర్యలు ఏమి తీసుకోవాలి?
ఈ వైరస్‌కి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. మనిషి నుండి మనిషికి ఈ వ్యాధి సోకిన ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యాక్సిన్ తయారుచేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం యాంటి వైరస్ మందు కొన్ని వినియోగంలో ఉన్నాయి. దీన్ని వాణిజ్యపరంగా టామిఫ్లూ-జనమివిర్ అని వ్యవహరిస్తున్నారు. దీన్ని రెలెంజా అని కూడా అంటారు. సాధారణ ఫ్లూ ఉపయోగించే మందులే బర్డ్ ఫ్లూకి కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. ఇంకా ఈ మందు తయారీకి చాలాకాలం పట్టవచ్చునని, వీటి తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వంటింటి వంటకాల ద్వారనే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు 700 సెంటిగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్లు నిర్ధారణ అవసరం.
టీకా ఏమయినా ఉందా?
చైనాను వణికిస్తున్న ప్రాణాంతక హెచ్7ఎన్9 రకం బర్డ్ ఫ్లూ వైరస్‌కు ఆ దేశ శాస్త్రవేత్తలు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేశారు. చైనా శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ఇదే తొలిసారి. పరిశోధనలో భాగంగా వీరు హెచ్7ఎన్9 వ్యాధి సోకిన రోగి గొంతు నుంచి కణజాలాలు సేకరించారు. తరువాత అందులోంచి వైరస్ విజయవంతంగా వేరు చేశారు. దీని కోసం ప్లాస్మిడ్ రివర్స్ జెనెటిక్స్, జెనెటిక్స్ రీయసార్ట్‌మెంట్ అనే విధానాన్ని అనుసరించారు.
బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ ప్లూయంజా) వైరస్..
Leave Your Comments