ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Rice Crop: రైతులు తమ వరి పంటను ఎలా సంరక్షించుకోవాలి ?

1
Rice Crop
Rice Crop

Rice Crop: ఆలస్యంగా వరి సాగు చేసే రైతులు నార్లు పోసుకోవడానికి సమయం లేనట్లయితే వర్షాలను సద్వినియోగము చేసుకొని పొలాలను దమ్ము చేసి స్వల్పకాలిక వరి రకాలను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవాలి.దీనివల్ల సమయం, పెట్టుబడి ఆదా అవుతుంది.

వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు గుంట నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3 జి. గుళికలను ఇసుకలో కలిపి నారుమడిలో చల్లుకోవాలి. వరిలో దోమపోటు ఉధృతి తగ్గించటానికి ప్రతీ రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటను తూర్పు, పడమర దిశలలో ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల గాలి, వెలుతురు బాగా సోకుతుంది. అదే విధంగా పురుగు మందులు, ఎరువులను సులభంగా వేసుకోవచ్చు. ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 జి. గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు నివారించుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో వివిధ రకాల పురుగులు,తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి.వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి.

Rice Crop

Rice Crop

* కాండం తొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు10 కిలోల చొప్పున వేసిన రైతులు, పొట్టదశలో 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గమనించిన చోట్ల నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుంచి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2గ్రా. + కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. + కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* తాటాకు తెగులు ఆశించిన చోట్ల నివారణకు 2మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరో పైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* ఆకుముడత గమనించిన ప్రాంతాల్లో 2 గ్రా, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.1మి.లీ. ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* కాండం కుళ్ళు తెగులు సోకిన ప్రాంతాల్లో 1 మి.లీ ప్రోపికొనజోల్ లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు వచ్చే వీలుంటుంది.దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజెబ్ మిశ్రమ మందు 2.5గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* సుడిదోమ గమనించిన ప్రాంతాల్లో.. ఉదృతి తక్కువగా ఉంటె ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ 1.5గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
*వరిలో జింక్ దాతువు లోపం కనిపిస్తోంది.దీని నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

డా.పి.లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త,
వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం,రాజేంద్రనగర్

Leave Your Comments

Rainfed Crops: ప్రస్తుతం వర్షాధార పంటల్లో ఏయే పురుగులు,తెగుళ్లు ఆశించే వీలుంటుంది ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

Previous article

Groundnut: వేరుశనగలో జిప్సం వేస్తె అధిక దిగుబడులు !

Next article

You may also like