ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులు

Weed Control In Cotton Crop: పత్తిలో కలుపు నివారణ

1
Weed Control In Cotton Crop
Cotton Crop

Weed Control In Cotton Crop: దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులొ మూడవ స్థానంలో ఉంది. లోతైన నల్లరేగడి భూములు పత్తి సాగుకు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్కా భూములు అనుకూలం కావు. జూన్ రెండో పక్షం నుంచి జూలై రెండో పక్షం వరకు ఈ పంటను విత్తుతారు.పత్తిలో కలుపు ప్రధాన సమస్య. దీనికి కారణం వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండడం,ఎరువులు అధికంగా వాడడం, వర్షాధారంగా పండించడం వల్ల కలుపు ఎక్కువగా పెరుగుతుంది. కలుపు మొక్కలు పత్తి పంటతో పోటీపడి నీరు, పోషకాలు,వెలుతురు ఉపయోగించుకొని పత్తి మొక్కల ఎదుగుదలను తగ్గిస్తాయి.తద్వారా దిగుబడులు తగ్గుతాయి.

Weed Control In Cotton Crop

Cotton Crop

కలుపును నివారించడానికి పత్తి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ద్రావకం ( స్టాంప్/ పెండి స్టార్/ ధనుటాప్) కలుపు మందును 1.2 లీటర్లు/ 200 లీటర్ల నీటిలో లేదా పెండిమిథాలిన్ + పైరిథయోబ్యాక్ సోడియం ( మ్యాక్స్ కాట్) 4 మి. లీ/ లీటరు నీటిలో (ఎకరానికి 800 మి.లీ/ 200 లీటర్ల నీటిలో) కలిపి సరైన తేమ ఉన్నప్పుడు భూమిపై పిచికారి చేయాలి. భూమిలో సరైన తేమ లేనప్పుడు పెండిమిథాలిన్ 38.7% ద్రావకం ( స్టాంప్ ఎక్స్ ట్రా / పెండనిల్/ గదర్ మ్యాక్స్) 3.5మి. లీ./ లీటరు నీటిలో (ఎకరానికి 700 మి. లీ./ 200 లీటర్ల నీటిలో) కలిపి భూమిపై పిచికారి చేయాలి. పంట 20-25 రోజుల వయస్సులో ఎక్కువుగా గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటే క్విజాలోఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) 400 మి.లీ లేదా ప్రొపాక్విజాఫాప్ (ఎజిల్) 250మి.లీ. మరియు పైరిథయోబ్యాక్ సోడియం (హిట్ వీడ్, థీమ్, రైఫ్) 250 మి.లీ./ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. రెండు జాతుల కలుపు మొక్కలు ఉంటే పై రెండు మందులను కలిపి పిచికారి చేసుకోవాలి.

* వర్షాలు ఎక్కువగా వుండి అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితుల్లో లీటరు నీటికి పారాక్వాట్ 5 మి.లీ. లేదా గ్లైఫోసేట్ 10 మి.లీ మరియు 10 గ్రా. యూరియాతో కలిపి పత్తి మొక్కలపై పడకుండా,వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లుగా పిచికారి చేస్తే కలుపు నివారణ బాగా జరుగుతుంది.వరుసల మధ్య దూరం 5 అడుగులు వున్నట్లయితే కుబొటా లాంటి చిన్న ట్రాక్టరుతో అంతర కృషి చేసుకోవచ్చు. కలుపు మందులతో పాటుగా పత్తిలో సమయానుకూలంగా ప్రతీ వారం, పదిరోజులకొకసారి గొర్రు, గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు, పైరు పెరుగుదల బాగా ఉండి, భూమిలో ఎక్కువ తేమ నిల్వవుండి, తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది.

డా. ఎస్. సందీప్, డా.బి. ఏడుకొండలు, డా. జి. వీరన్న, డా.డి. అశ్విని, డా.వై.ప్రశాంత, డా. ఎస్. ఓం ప్రకాష్, డా.ఆర్. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్

Leave Your Comments

Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు !

Previous article

Government Schemes For Dairy Farm In AP: ఏపీలో పశువులు, జీవాల షెడ్ల నిర్మాణానికి రాయితీలు

Next article

You may also like