PJTSAU : రాజేంద్రనగర్ లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (T G I R D) లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమేవేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యత రైతు సంక్షేమమని రానున్న మూడు నెలల్లో 50,000 నుండి 60,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ, రైతు భరోసా, పంట భీమ, రైతూ భీమ, పథకాలకు ఖర్చు చేయబోతుందని, ఇది ప్రభుత్వానికి భారమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహోసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని ఈ సందర్భములో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు భాధ్యతతో, నిబద్దతతో వారి విధులను నిర్వర్తించాలని కోరారు.
* రానున్న పదేళ్ళలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టే గురుతర భాద్యత మన మిద ఉందని తెలియచేసారు.
* రైతుకు తోడుగా ఉండి ఆర్థికంగా నిలబెట్టాలి. తలెత్తుకొని జీవించేలా చెయ్యాలి అనే ఆశయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకనే రుణమాఫీ అమలు చేస్తున్నామని, రానున్న కాలంలో ఆర్ధిక వెసులుబాటు బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్దరిస్తామని, ఇప్పటికే మట్టినమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోనికి తెచ్చి భుసార పరిక్షలు అరంబించిన విషయం గుర్తు చేసారు.
* వానాకాలంలో విత్తనాల సరఫరా రాష్ట్రం అంతటా బాగున్నపటికీ ఒకటి, రెండు కంపెనీల విత్తనాల విషయంలో ఒకట్రెండు జిల్లాల్లో ఇబ్బందులు తల్లెత్తితే ఆది రాష్ట్రమంతట ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకనే జిల్లా వ్యవసాయ,ఉద్యాన,పట్టుపరిశ్రమ శాఖల అధికారులు రైతులకు సంబంధించిన ప్రతివిషయంలో ముందుగా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకు పోవాలి. రాష్ట్రస్థాయి అధికారుల ప్రోత్సాహం వారి నుండి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని, రైతు అందరికి అన్నం పెడతాడు అటువంటి వారికీ సేవ చేసే అవకాశం రావడం మనందరి అదృష్టంగా బావించి పనిచేయాలని సూచించారు.
* ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుంటూ భూగర్భ జలాలు, ప్రాజెక్ట్ నిల్వలు చూసుకుంటూ ఆ ప్రకారం రైతులకు పంటల సాగుకు సలహాలివ్వాలని అన్నారు.
మరెన్నో విషయాల్లో దిశానిర్దేశం చేసారు.అవి …
1 . ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, కొత్తపంటలు ఏమి ఉన్నాయి, మార్కెటింగ్ సౌకర్యాలు ఏమిటి, ఇలా అన్ని రైతులకు చెప్పాలి.
2. రైతుభీమాలో కూడా 1222 క్లేయిమ్స్ వివిధ దశలలో పెండింగ్ లో ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా లేదా అన్నది ఏప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
3. రైతులకు అన్ని రకాల పెట్టుబడులు నాణ్యమైనవి అందుతున్నాయా, లేదా? నిర్ధేశించిన ధరలకే దొరుకుతున్నాయా,లేదా? చూడాలి.
4. పంటల నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక AEO ఉన్నాడు కాబట్టి పంటలనమోదులో ఖచ్చితత్వం ఉండాలి. ఇది అన్నిటికి ప్రాతిపదిక. రైతుభరోసాకు, పంటలభీమాకు, తర్వాత మార్కెటింగ్ కు ఇదే ఆధారం అని తెలియచేసారు .
5. అదేవిధంగా ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి 3 వ సంవత్సరం ఆరంభంలోకి వచ్చినా, ఇంకా రెండు డిపార్ట్ మెంట్ ల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. 2023-24 లో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి (26% మాత్రమే) చూపెట్టారు.
6. ఆయిల్ పామ్ కు సంబంధించి AO/HO వేరుకాదు. HOకు ఎటువంటి బాధ్యతలు ఉన్నాయో, AO కు కూడా అటువంటి బాధ్యత ఉంది. HEO లు లేరు కాబట్టి AEO లు పూర్తి బాధ్యత తీసుకోవాలి. రైతును ఎంపిక చేయడం నుండి డ్రిప్ ఇన్ స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు ప్రతిదాని మీద AEO/AO బాధ్యత తీసుకోవాలి.
7. ఇకనుండి ప్రతివారం శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి ఒక బృందంగా ఏర్పడి జిల్లాలో కనీసం వారానికి రెండు మండలాలు సందర్శించి సలహాలిచ్చే విధంగా, అది జిల్లా వ్యాప్తంగా రైతులకు తెలిసేవిధంగా చూడాలి. అదేవిధంగా రైతులు అందించే ఇన్ పుట్ ఆధారంగా రైతులకు ఉపయోగపడే విధంగా పరిశోధనలను యూనివర్సిటీ అధికారులు చేపట్టాలి.
8. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడిపై ఆయిల్ పామ్ కే కాకుండా ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుండి ఇస్తున్నాం కాబట్టి ఉద్యానపంటల సాగును, కూరగాయల సాగును ప్రొత్సహించాలి.
ఈ కార్యక్రములో స్థానిక శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ , వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాష, కో ఆపరేటివ్ డైరెక్టర్ ఉదయ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచలకులు డా.పి.రఘురామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి బాయి, మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మరియు ఆధికారులు పాల్గొన్నారు.
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ. 50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లు
Leave Your Comments