తెలంగాణతెలంగాణ సేద్యంవార్తలు

ఖరీఫ్ సీజన్ లో వివిధ పంటలలో విత్తనాల ఎంపిక, రైతులు చేపట్టాల్సిన సాగు, యాజమాన్య పద్ధతులు: PJTSAU

0

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో వివిధ పంటలలో రైతులు చేపట్టాల్సిన సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తనాల ఎంపిక వంటి పలు అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు చేసింది. వివిధ పంటలకి సంబంధించి రైతులకు అందించిన సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
వరి:-
1. అధిక దిగుబడి, సకాలంలో పంటల సాగు కోసం వరిలో నేరుగా విత్తే పద్ధతిని ప్రోత్సహించాలి.
2. దీర్ఘ, మధ్యకాలిక రకాల నర్సరీలను ప్రస్తుతం చేపట్టవద్దు, కేవలం స్వల్పకాలిక (120- 125 రోజులు) వరి రకాలను మాత్రమే చేపట్టాలి.
3. ఆలస్యంగా వరి నాటు చేపట్టినట్లయితే, వరిలో ఉల్లికోడు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రెండు గుంటల నర్సరీలో ఒక కేజీ కార్భోపురాన్ గుళికలు వేసుకోవాలని సూచించారు. అలాగే నాటు వేసిన 15-20 రోజుల తర్వాత 10 కిలోల కార్భోపురాన్ గుళికలు వేసుకోవాలని సూచించారు.
4. నీటి లభ్యత లేకపోవడం ఇతరత్రా కారణాల వల్ల వరి నాటు ఆలస్యమైతే, 5-7 పిలకలతో దగ్గర, దగ్గరగా నాటు కోవాలని సూచించారు. అలాగే 70 శాతం నైట్రోజన్ ను అడుగుపిండిగా వేసుకోవాలి.
పత్తి:-
1. జూలై 20 వరకు కూడా పత్తి పంట వేసుకోవచ్చు మంచి దిగుబడులు కూడా వస్తాయి.
2. వర్షాధారమైన మరియు తేలిక పాటి నేలలో 90×15 or 20 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. అలాగే పత్తిలో కంది అంతర పంటగా 6:1 నిష్పత్తిలో విత్తుకోవాలి.
3. మొక్కల సంఖ్య సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి నాటిన 10-12 రోజులలో మొలకెత్తని మొక్కల స్థానంలో పత్తిని విత్తుకోవాలి.
సోయాబీన్:-
1. సోయాబీన్ ను జూలై మొదటి వారం లోపు విత్తుకోవాలి.
2. వర్షాధార పంటగా సోయాబీన్ ను సాగు చేస్తున్నట్లయితే కందిని అంతర పంటగా 7:1 నిష్పత్తిలో విత్తుకోవాలి.
3. అలాగే ఎకరాకు 25-30 కిలోల విత్తనాన్ని వాడాలి.
4. నైట్రోజన్ ను 50 శాతం అంటే ఎకరాకు 22 కిలోల యూరియాను వాడాలి.
5. కాండం ఈగను నివారించేందుకు ఇమిడాక్లోప్రెడ్ ద్రావణంలో 1.5 ml/kg విత్తనాలు శుద్ధి చేసుకోవాలి.
మొక్కజొన్న:-
1. మొక్కజొన్నను జూలై 15 వ తేదీ వరకు సాగు చేసుకోవచ్చు, మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
2. వర్షాధారంగా తేలిక నేలల్లో మొక్కజొన్న మాత్రమే సాగు చేస్తున్నట్లయితే అంతర పంటగా కందిని 4:1 నిష్పత్తిలో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.
3. కత్తెర పురుగు నుంచి పంటను రక్షించడానికి Cyantriniliprole + Thiomethaxan ద్రావణాన్ని కిలోకి 6 మి.లీ నీటిలో విత్తన శుద్ధి చేపట్టాలి. ఇలా చేస్తే మొక్కజొన్న విత్తిన 21 రోజుల వరకు కూడా కత్తెర పురుగు సోకదు.
కంది:-
1. ఖరీఫ్ లో కంది సాగుకు జూలై 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కూడా అనుకూలం.
2. స్వల్ప-మధ్య కాలపరిమితి కలిగిన (140 – 160 రోజులు) PRG -176, WRGE-97, WRGE-93, కందిరకాలు, తక్కువ వర్షపాతం కల్గిన, తేలిక నుంచి మధ్యతరహా నేలల్లోను, వర్షాధార ప్రాంతాలకు ఇవి అనుకూలం.
3. కందిలో ఎండు తెగుళ్లను తట్టుకునే మధ్యకాలిక (150-180 రోజులు) రకాలైన ICPL – 87119, WRG-255, TDRG-59 ను అధిక వర్షపాతం ఉన్న నల్ల నేలల్లో సాగు చేసుకోవచ్చు.
4. అలాగే కందిలో అంతర పంటలుగా పెసర, మినుము, వేరుశనగ, సోయాబీన్ 1:7 నిష్పత్తిలో, కంది + మొక్కజొన్న/జొన్న 1:4 నిష్పత్తిలో, కంది + పత్తి 1:6 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు.
పెసర/ మినుము:-
1. ఖరీఫ్ లో సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా పెసర,/ మినుము పంటను సాగు చేయవచ్చు.
2. పెసరలో MGG- 295, MGG- 385, అలాగే మినుము లో MBG-1070, PU-31 రకాలు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా.పి. రఘురాంరెడ్డి సూచించారు.

Leave Your Comments

జూన్ 26 నుంచి జూన్ 30 వరకు తెలంగాణాలో సాగుదార్లకు సూచనలు

Previous article

జూలై 3 నుండి 7వ తేదీ వరకు పంటల సాగులో ఈ సూచనలు పాటించండి…

Next article

You may also like